పారదర్శకంగా ‘సర్‌’ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ‘సర్‌’

Jul 17 2026 7:27 AM | Updated on Jul 17 2026 7:27 AM

తిరుపతి అర్బన్‌: తప్పులు లేకుండా.. పారదర్శకంగా సర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేష్‌ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌యాదవ్‌ సూచించారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌తోపాటు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు భరత్‌నాయక్‌, రోజ్‌మాండ్‌, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, తిరుపతి అర్బన్‌ తహసీల్దార్‌ సురేష్‌బాబు, ఎన్నికల జిల్లా సూపరింటెండెంట్‌ భాగ్యలక్ష్మి తదితరులు హాజరయ్యారు. జిల్లాలో ఓటర్లు, ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్‌ తదితర సమాచారాన్ని కలెక్టర్‌ వివరించారు.

నీట్‌ ఫలితాల పరిశీలనలో నిమగ్నం

తిరుపతి సిటీ: ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న నీట్‌ ఫలితాలను ఎన్‌టీఏ గురువారం రాత్రి విడుదల చేసింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా గత నెల 21వ తేదీన జరిగిన రీ నీట్‌కు 4,956మంది విద్యార్థులు హాజరయ్యారు. గురువారం రాత్రి 8 గంటలకు ఫైనల్‌ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అనంతరం రెండు గంటల వ్యవధిలో ఫైనల్‌ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అన్ని కేటగిరీల్లో కటాఫ్‌ మార్కులు 22 నుంచి 25వరకు పెరగనున్నట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. దీంతో పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement