26 ఏళ్ల సర్వీసును సున్నా చేసేశారు | - | Sakshi
Sakshi News home page

26 ఏళ్ల సర్వీసును సున్నా చేసేశారు

Jul 17 2026 7:27 AM | Updated on Jul 17 2026 7:27 AM

‘నేను 1998 డీఎస్సీలో ఎస్జీటీగా విధుల్లో చేరాను. 2023లో ఇంగ్లీష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి వచ్చి వి.కోటకు బదిలీ అయ్యింది. కుటుంబ సమస్యల వల్ల రివర్షన్‌ వచ్చాను. పాత సీనియారిటీ ప్రకారం నా నంబర్‌ 500లో ఉండేది. ఇప్పుడు నా నంబరును 5,287కు మార్చేశారు. నా 26 ఏళ్ల సర్వీసును మొత్తంగా తుడిచేసి నన్ను జూనియర్‌గా మార్చేశారు. ఇకపై నా జీవితంలో ఉద్యోగోన్నతి పొందే అవకాశం లేకుండా చేయడం ఏ రకమైన న్యాయం? అధికారులు స్పందించి పాత సీనియారిటీని పునరుద్ధరించాలి. – కృష్ణారెడ్డి, బాధిత ఎస్జీటీ ఉపాధ్యాయుడు

ఉద్యోగ విరమణ వేళ ఇంత అన్యాయమా?

‘మా అమ్మగారి ఆరోగ్యం క్షీణించడంతో నేను ఉద్యోగోన్నతి వదులుకుని రివర్షన్‌ తీసుకోవాల్సి వచ్చింది. గత సీనియారిటీ జాబితాలో 210వ స్థానంలో ఉన్న నా నంబరును, ఇప్పుడు ఏకంగా 5,290కి నెట్టేశారు. నేను ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న సమయంలో విద్యాశాఖ ఇంతటి అన్యాయానికి ఒడిగట్టడం తగదు. ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మాపై మానవతా దృక్పథం చూపాలి.

– హేమనాథం, బాధిత ఎస్జీటీ ఉపాధ్యాయుడు

పాత సీనియారిటీకి రక్షణ లేదు

రెండు, మూడు దశాబ్దాలు గా టీచర్లుగా సేవలందించి సీనియర్లుగా అనుభవం గడించిన వారి సీనియారిటీ ని రక్షించాల్సి ఉంది. బలమై న కారణాలతోనే ఆర్థిక నష్టాన్ని భరించి వారు రివర్షన్‌ తీసుకున్నారు. వారి సర్వీసును సున్నా చేయడం చట్టవిరుద్ధం. విద్యాశా ఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి, సవరించిన నిబంధనలతో కొత్త సీనియారిటీ జాబితాలను విడుదల చేయాలి. లేనిపక్షంలో ఉపాధ్యాయుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుంది. – గంటా మోహన్‌,

ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement