నిలిచారు మేటిగా.. | - | Sakshi
Sakshi News home page

నిలిచారు మేటిగా..

Aug 24 2025 12:08 PM | Updated on Aug 24 2025 2:14 PM

నిలిచారు మేటిగా..

నిలిచారు మేటిగా..

మెగా డీఎస్సీ ఫలితాలు విడుదల ఉద్యోగాలకు అర్హత సాధించిన పలువురు అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో మెరిట్‌ జాబితా అభ్యర్థుల వ్యక్తిగత ఐడీ లాగిన్లకు కాల్‌లెటర్‌లు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు విద్యాశాఖ సన్నాహాలు కొందరు మొదట్లో క్వాలిఫైడ్‌.. ఇప్పుడేమో నాట్‌ క్వాలిఫైడ్‌ సందేహాల నివృత్తికి పనిచేయని విద్యాశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్లు

పట్టుదలే తోడుగా..

చిత్తూరు కలెక్టరేట్‌ : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు తుది ఫలితాలు శుక్రవారం అర్ధరాత్రి విడుదలయ్యాయి. సంవత్సరాల తరబడి ఆచార్య కొలువునకు శిక్షణ పొంది, సన్నద్ధం అయిన అభ్యర్థుల కలలు నెరవేరాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో ప్రతిభ చాటిన వారికి ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువులు దక్కాయి. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు డీఎస్సీ అభ్యర్థుల తుది మెరిట్‌ జాబితాను సబ్జెక్టుల వారీగా విడుదల చేశారు. సంబంధిత జాబితాలను రాష్ట్ర విద్యాశాఖ డీఎస్సీ వెబ్‌సైట్‌తో పాటు, డీఈఓ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. సబ్జెక్టుల వారీగా పరీక్షలు రాసిన డీఎస్సీ అభ్యర్థులు తమ మెరిట్‌ జాబితాలను పరిశీలించుకునే వెసులుబాటు కల్పించారు. ర్యాంకుల వారీగా అభ్యర్థులు సాధించిన ఫలితాలను మెరిట్‌ జాబితాల్లో పేర్కొన్నారు. ఆ మెరిట్‌ ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులు టీచర్‌ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులు సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,478 పోస్టుల భర్తీ

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,478 టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థుల తుది ఫలితాలను ర్యాంకుల వారీగా పేర్కొన్నారు. జూన్‌ 5వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం విడుదల చేసిన తుది మెరిట్‌ జాబితా ఆధారంగా పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అర్హత సాధించిన అభ్యర్థుల డీఎస్సీ వ్యక్తిగత లాగిన్‌లో కాల్‌లెటర్లను పంపనున్నారు. ఆ కాల్‌లెటర్ల ఆధారంగా అభ్యర్థులు నిర్దేశించిన కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.

పట్టుదలకు శ్రమ తోడైతే విజయం సొంతమవుతుందని నిరూపించారు. మెగా డీఎస్సీ పరీక్షల్లో వేలాది మంది అభ్యర్థులను అధిగమించి ముందంజలో నిలిచారు. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని అహర్నిశలు శ్రమించారు. ప్రభుత్వ కొలువులు దక్కడమే గగనమైనే నేటి పరిస్థితుల్లో ఆచార్య కొలువులకు ఎంపికై తమ సత్తా చాటారు. శుక్రవారం అర్ధరాత్రి విడుదలైన ఫలితాలు చూసుకుని సంబరాలు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement