
విద్యార్థులకు శాపం
ఇంటర్ ఫలితాలు విడుదలైనా సింగిల్, డబుల్ మేజరంటూ విద్యార్థులను మభ్యపెట్టి, ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినా అందులోనూ అంతా అయోమయే. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ విద్యార్థులకు శాపంగా మారింది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఆయా కళాశాలలు మళ్లీ ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుందంటూ మెలిక పెట్టడం దారుణం.
– భగత్ రవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి
అదృష్టం ఉండాల్సిందేనా?
డిగ్రీ ప్రవేశాలకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన వెబ్‌సైట్ విద్యార్థులకు నరకం చూపిస్తోంది. దరఖాస్తు చేసుకోవాలంటే అదృష్టం ఉండాల్సిదే. సాఫ్ట్‌వేర్‌లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక కోర్సుకు దరఖాస్తు చేస్తే మరో కోర్సుకు దరఖాస్తు చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఉన్నత విద్యామండలి అసమర్థత స్పష్టంగా కనిపిస్తోంది. – ప్రవీణ్ కుమార్,
ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి, తిరుపతి

విద్యార్థులకు శాపం