
అర్ధరాత్రి దుకాణాల కూల్చివేత
రేణిగుంట : బస్టాండ్ సమీపంలోని ఏడు దుకాణాలను ఆదివారం అర్ధరాత్రి కూల్చివేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పంచాయతీ నుంచి స్థానికులు స్థలం లీజుకు తీసుకుని గదులు నిర్మించుకుని దుకాణాలు నిర్వహించుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత షాపులను ఖాళీ చేయించారు. అక్కడితో ఆగకుండా జేసీబీతో ఏడు షాపులను నేలమట్టం చేసేశారు. పంచాయతీ, రెవెన్యూ, ఆర్‌టీసీ అధికారులు ఈ పని చేశారా..? లేదా టీడీపీ నేతల నిర్వాకమా..? అర్థం కావడం లేదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ ఈఓను సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.
పంచాయతీ తీర్మానం ప్రకారమే తొలగించాము
బస్టాండ్ వద్ద ఖాళీగా ఉన్న గదులను గతంలో తొల గించాలని పంచాయతీ తీర్మానం చేసింది. అందులో భాగంగా గత రాత్రి సిబ్బంది ఆ గదులను తొలగించారు. – మాధవి పంచాయతీ ఈవో రేణిగుంట