
వైకల్యం తగ్గింపు నాకు బాధేస్తోంది
నేను 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నాను. రెండు కాళ్లు పనిచేయవు.. మూడు చక్రాల బండికి పరిమితమయ్యాను. పుట్టుకతోనే కాళ్లు పనిచేయకున్నా ఎన్నడూ బాధపడలేదు. ఈ ప్రభుత్వంలో రీవెరిఫికేషన్ చేసి 60 శాతం మాత్రమే వైకల్యం వున్నట్టు ధ్రువీకరణ పత్రం ఇవ్వడంతో బాధపడుతున్నాను. అంగవైకల్యంతో బాధపడుతున్న నన్ను బాధపెట్టే ఏ ప్రభుత్వమైనా బాధపడాల్సిందే.. పింఛన్లు తగ్గించుకోవడం కోసం ఇంతలా దిగజారాల్సిన పనిలేదు.
– ఖాదర్‌సాహెబ్, దివ్యాంగుడు, జీవకోన, తిరుపతి
చేతులు లేని నేను ఎలా బతకాలి
13 ఏళ్ల వయస్సులో విద్యుత్ షాక్‌కు గురై రెండు చేతులు పో గొట్టుకున్నా. దివ్యాంగ పింఛన్ తీసుకుంటు న్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా నా పింఛన్ తీయలేదు. ఎందుకంటే కళ్లతో చూడగానే నాకు చేతులు లేవని 100 శాతం వైకల్యం ఉన్నట్టు వైద్యులు కూడా నిర్ధారణ చేశారు. రీ వెరిఫికేషన్‌కు వచ్చిన వైద్యులు నా పరిస్థితిని కళ్లారా చూసి 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని నిర్ధారణ చేశారు. నా పింఛను కూడా రద్దు చేస్తామని సచివాలయం ఉద్యోగులు చెప్పారు. రెండు చేతులు లేని నేను ఏ పనిచేసుకుని బతకాలో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. – దక్షిణాదిబాబు, దివ్యాంగుడు,
నక్కలకాలనీ, తిరుచానూరు

వైకల్యం తగ్గింపు నాకు బాధేస్తోంది