
యాజమాన్యం మోసం చేసింది
గత వారంలో ఉద్యోగులమంతా నిరసన తెలిపాం. యాజమా న్యం ప్రతి నిధులను పంపించి, మాతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం చేయలేదు. యాజమాన్యంపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి.
– చంద్రకళ, ఉద్యోగిని, వింగ్ టెక్ పరిశ్రమ
మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి
గతంలో మేము ఉద్యోగాల్లో చేరేటప్పుడు శాశ్వత ఉద్యోగులుగా మిమ్మల్ని తీసుకుంటున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు పరిశ్రమ మరొకరి చేతికి వెళ్లడంతో వాళ్లు మాకు సంబంధం లేదంటున్నారు. రెండు పరిశ్రమల యాజమాన్యం ఉద్యోగుల భవితవ్యంతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వం చొరవ చూపి, మాకు న్యాయం చేయాలి.
– బాలాజీ, ఉద్యోగి, వింగ్‌టెక్ పరిశ్రమ
ప్రభుత్వం జవాబు చెప్పాలి
గతంలో చంద్రబాబు సమక్షంలో పదివేల మందికి ఉ ద్యోగాలు ఇస్తామని వింగ్‌టె క్ ఒప్పందం కుదుర్చు కుంది. కానీ పది వేల మంది మా ట అటుంచితే ప్రస్తుతం పనిచేస్తున్న 200 మందిని తీసివేయడం దారుణం. దీనికి కచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రజలను మోసం చేస్తోందనడానికి ఇదే ఉదాహరణ.
– బాలసుబ్రమణ్యం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు

యాజమాన్యం మోసం చేసింది

యాజమాన్యం మోసం చేసింది