గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం వికలత్వం ఉండేది. దాంతో రూ.6 వేలు ఫించన్ ఇచ్చేవారు. తాజాగా కూటమి ప్రభుత్వంలో చేపట్టిన రీవెరిఫికేషన్‌లో 58 శాతం వి కలత్వం చూపించా రు. ఎంబీఏ చదువుకున్న నేను రిజర్వేషన్ కోల్పోతాను. 70 శాతం కంటే తక్కువ వికలత్వం ఉంటే ప్రభుత్వ పథకాలు అందవు. నాకు న్యాయం చేయాలని సోమవారం జరిగిన ధర్నాలో పాల్గొని, అధికారులకు మొరపెట్టుకున్నారు. – భువనేశ్వర్‌రెడ్డి,
దివ్యాంగుడు, యర్రావారిపాళెం మండలం
15 వేలు నుంచి 6 వేలకు తగ్గింపు
అనారోగ్యంతో బాధప డుతున్న నాకు 90 శాతం వైకల్యం ఉండడంతో రూ.15 వేలు పింఛన్ ఇ చ్చేవారు. అయితే రీవె రి ఫికేషన్‌లో 75 శాతం వైక ల్యం ఉన్నట్టు సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో రూ.15 వేలు పింఛన్‌ను రూ.6 వేలకు తగ్గించారు. రూ.15 వేలు ఇస్తేనే వైద్య ఖర్చులకు చాలడం లేదు. రూ.6 వేలు ఎక్కడికి సరిపోతాయి. ఇక నాకు అగచాట్లు తప్పవు.
– గోపీనాథ్, దివ్యాంగుడు, నారాయణవనం
ఇది న్యాయం కాదు
పాతికేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నాను. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీ ఎంగా రాజశేఖరరెడ్డి ఉ న్నప్పుడు రూ.200 పింఛను ఇవ్వగా ఆ సమయంలో పింఛనుకు దర ఖాస్తు చేసుకున్నాను. అ ప్పటి నుంచి పింఛన్ పొందుతున్నాను. కూటమి నేతలు తమ ప్రభుత్వం వస్తే మరింత మేలు చేస్తామని చెబితే నమ్మి ఓటు వేశాను. ఆ సర్కారు కొలువుదీరిన ఏడాదికే నా పింఛన్ తగ్గించేస్తోంది. రెండు కాళ్లు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్న నాకు రీవెరిఫికేషన్‌లో 55 శాతం మాత్రమే వైకల్యం ఉన్నట్టు నిర్ధారించారు. ఇది న్యాయం కాదు. – శ్రీనివాసులు,
దివ్యాంగుడు, తాతయ్యగుంట, తిరుపతి
అప్పుడు 90 శాతం..ఇప్పుడు 58 శాతం
అప్పుడు 90 శాతం..ఇప్పుడు 58 శాతం