
ప్రశ్నార్థకంగా విద్యార్థుల భద్రత
రేణిగుంట : ఎయిర్‌పోర్టు సమీపంలోని బీజీఎస్ నేషనల్ పబ్లిక్ స్కూల్ బస్‌లో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. డ్రైవర్ వ్యవహారశైలితో పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. రహదారి భద్రతా నియమాలను బేఖాతర్ చేస్తూ అత్యంత వేగంగా వా హనం నడుపుతున్నాడు. దీంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధిలేని పరిస్థితుల్లో స్కూల్ బస్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే సో మవారం సైతం పాత చెక్‌పోస్టు వద్ద ఇష్టారాజ్యంగా బస్ నడిపి స్థానికులను ఢీకొట్టినంత పనిచేశాడు. పైగా ప్రశ్నించిన వారితో దురుసుగా ప్రవర్తించాడు. దిక్కు న్న చోట చెప్పుకోండంటూ వెళ్లిపోయాడు. ర వాణా శాఖ అధికారులు దీనిపై తగు చర్యలు చేపట్టాలని, పా ఠశాల యాజమాన్యం డ్రైవర్ పనితీరును పర్యవేక్షించాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు.