
చదరంగంతో మేధో సంపత్తి
వెంకటగిరి రూరల్ : చదరంగం ఆడడం ద్వారా మేధో సంపత్తి పెరుగుతుందని వెంకటగిరి రాజ కుటుంబీకులు సర్వజ్ఞ కుమార యాచేంద్ర తెలిపారు. ఆదివారం పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ పోటీలను ఆయన ప్రారంభించారు. మన రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుంచి సుమారు 280 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఒక్కప్పుడు రాజాల వరకే పరిమితమైన క్రీడా పోటీలు నేడు మారుమూల గ్రామాల సైతం విస్తరించాయన్నారు. క్రీడలపై యువత మక్కువ పెంచుకోవాలని సూచించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చెస్ అకాడమీ నిర్వాహకుడు నర్రా వినయ్‌కుమార్ పాల్గొన్నారు.