
ప్లాస్టిక్ తయారీని అరికట్టాలి
చిల్లకూరు : వాతావరణ కాలుష్యం నిర్మూలించేందుకు ముందుగా ప్లాస్టిక్ తయారీని అరికట్టాలని, ఈ మేరకు ఆయా పరిశ్రమలను మూసివేయాలని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం సూచించారు. ఆదివారం గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక మహా సభలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మూడ నమ్మకాలపై ప్రజలను అప్రమత్తం చేయడంలో జేవీవీ పాత్ర కీలకమన్నారు. విద్యార్ధులను చైతన్యవంతం చేసి వారి ద్వారా మరింత ప్రచారం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జేవీవీ పట్టణ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, సుమన్‌రెడ్డి, ఇబ్రహీం, శర్మ, అశోక్ పాల్గొన్నారు.