
.
డక్కిలి: వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు కలిమిలి రాజేశ్వరి కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గురువారం పరామర్శించారు. ఇటీవల జెడ్పీటీసీ రాజేశ్వరి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గురువారం డక్కిలి మండలం చాపలపల్లి గ్రామంలో ఆమె ఉత్తర క్రియలు జరిగాయి. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చాపలపల్లికి వచ్చారు. అనంతరం రాజేశ్వరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
తరువాత రాజేశ్వరి భర్త, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి, కుమార్తెలను పలకరించి కొంతసేపు వారితో మాట్లాడారు. ఆయన వెంట నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ నెల్లూరు రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు కొడవలూరు ధనుంజయరెడ్డి, పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, బొలిగర్ల మస్తాన్ యాదవ్, ఎంపీపీలు తనూజరెడ్డి, గోను రాజశేఖర్, గూడూరు భాస్కర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దొంతు శారద, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.