
విద్యార్థులకు పోస్టల్ స్కాలర్‌షిప్‌లు
విద్యార్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతూ ఉండాలి
పాఠశాలల్లో ఫిలాటెలి క్లబ్‌లో సభ్యత్వం ఉండాలి. లేదా వ్యక్తిత్వ ఫిలాటెలి డిపాజిట్ అకౌంట్ కలిగి ఉండాలి
గత విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులు లేదా తత్సమానమైన గ్రేడ్ పాయింట్లు సాధించి ఉండాలి (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5శాతం మినహాయింపు ఉంటుంది)
తిరుపతి ఎడ్యుకేషన్ : తపాలా బిళ్లలు సేకరించేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం దీన్‌దయాళ్ స్పర్స్ యోజన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తిరుపతి డివిజన్ పోస్టాఫీసుల సీనియర్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ పథకం విద్యార్థులు తమ హాబీని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా చరిత్ర, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, భూగోళ శాస్త్రం వంటి విభాగాలపై అవగాహన పెంచుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఏడాది వరకు రూ.6 వేలు నగదును స్కాలర్‌షిప్‌గా వారి పోస్టల్ ఖాతాలో జమచేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబరు 16వ తేదీలోపు దరఖాస్తులను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, తిరుపతి డివిజన్, తిరుపతి – 517501 చిరునామాకు స్పీడు పోస్ట్ ద్వారా పంపించాలని, స్పీడ్ పోస్టు రుసుమును ఫిలాటెలి స్టాంపుల రూపంలో కవరకు అంటించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించాలని తెలిపారు.
ఎంపిక ఇలా..
అర్హతలు ఇవే..