
పింఛన్ తొలగించారు
తిరుపతిలోని కర్నాల వీధిలో నివాసిస్తున్నా. పూర్తిగా దివ్యాంగురాలిని. ఒక్క అడుగు కూడా పెట్టలేను. గతంలో 75శాతం వైకల్యంతో సదరం సర్టిఫికెట్ ఇచ్చా రు. ఇప్పుడు 40శాతానికి కుదించారు. దీంతో సచివాలయ సిబ్బంది నన్ను పింఛన్ జాబితా నుంచి తొలగించారు. నాకు తల్లిదండ్రులు లేరు. కేవలం పింఛన్ సొమ్ముతోనే జీవిస్తున్నా. మళ్లీ నాకు పింఛన్ ఇప్పించాలని కోరుతున్నా.
– కుప్పచ్చి అరుణ, తిరుపతి
పొట్టకొడుతున్నారు
నాకు చెవుడు, మరుగుజ్జుని కావడంతో వివాహం కాలేదు. ఒంటరి మహిళను. సుమారు పదేళ్లుగా పింఛన్ డబ్బులతోనే బతుకుతున్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నా పొట్టకొడుతున్నారు. సెప్టెంబర్ నుంచి పింఛన్ ఇవ్వమని సచివాలయ ఉద్యోగులు నోటీసు ఇచ్చారు. ఏం చేయాలో తెలియడం లేదు. మాలాంటి వారితో ప్రభుత్వం ఆడుకోవడం సరికాదు. మాకు న్యాయం చేయండి. – సుబ్బమ్మ,
వేముగుంటపాళెం, నాయుడుపేట మండలం
కనికరం చూపండి
నాకు ఒక కన్ను పూర్తిగా పోయింది. ఇంకోటి సరి గా కనపడదు. అంధురాలిగా అష్టకష్టాలు పడుతు న్నా.2010 నుంచి దివ్యాంగ పింఛన్ ఇస్తున్నారు. ఆ డబ్బులతోనే బతుకుతున్నా. ఇప్పుడు నా పింఛన తొలగిస్తున్నట్లు సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు. నా భర్త కస్తూరయ్య ఆరోగ్యం సరిగా లేదు. ఈ పరిస్థితుల్లో పింఛన్ తొలగిస్తే మేం బతికేదెట్టాగో కూడా తెలియడం లేదు. కనికరం చూపండి అని అధికారులను వేడుకున్నా.
– సాని కోటమ్మ, మడిపల్లం, నాయుడుపేట

పింఛన్ తొలగించారు

పింఛన్ తొలగించారు