
అంధకారంలో విద్యారంగం
తిరుపతి రూరల్:కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం అంధకారంలోకి వెళ్లిపోయిందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆరోపించారు. విద్యార్థి సంఘాల అణచివేతకు ప్రభుత్వం జారీ చేసిన జీఓలకు వ్యతిరేకంగా సోమవారం ఎస్వీయూ ప్రధాన ద్వారం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ అక్రమ జీఓలను ఉపసంహరించుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి సంఘాలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందన్నారు. విద్య రంగంపై ఏ మాత్రం అవగాహనలేని నారా లోకేష్‌కు ఆ శాఖ అప్పగించడంతోనే ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. విద్యార్థి సంఘాలపై నిషేధం విధించిన మంత్రి నారా లోకేష్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీఓ ప్రతులను చించివేసి నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి వల్లం రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, నేతలు చెంగల్‌రెడ్డి, యశ్వంత్‌రెడ్డి, రఫీ, ప్రదీప్, భానుప్రకాష్‌రెడ్డి, వినోద్, రాజేంద్ర, నరేష్, మునిరాజ, ప్రేమ్‌కుమార్, హరినాథ్, పార్థసారధి, యుగంధర్, సుధాకర్, ముని, ప్రభు, శేషరెడ్డి, వెంకట్ రమణ నాయక్, వీర నాగేంద్ర, హరిబాబు, నవీన్‌రెడ్డి, దినేష్‌కుమార్ పాల్గొన్నారు.