
వేద సదృశ్యం.. ఆగమశాస్త్రం
తిరుపతి సిటీ : సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవి వేదాలని, వాటి సదృశ్యాలే ఆగమ శాస్త్రాలని మైలాపురం సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.అరుణసుందరం తెలిపారు. సంస్కృత వర్సిటీలో నిర్వహిస్తున్న చతురాగమ జాతీయ సదస్సుకు సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అరుణసుందరం మాట్లాడుతూ వేదాలు భారతీయ సంస్కృతికి దర్పణాలని చెప్పారు. వైఖానస, పాంచారాత్ర, శైవ, తంత్రసార ఆగమాలు వేద సదృశ్యాలేనని వివరించారు. ఆగమోక్త అంశాలపై పరిశోధనలు చేపట్టాలని కోరారు. అనంతరం వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆగమశాస్త్ర సంరక్షణ,, గ్రంథాల ముద్రణకు వర్సిటీ కృషి చేస్తోందన్నారు. త్వరలోనే ఆగమ ప్రదర్శనశాల ఏర్పాటు చేయనున్నట్లు, ఈ మేరకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. టీటీడీ ఎస్వీ వేదపాఠశాల ప్రిన్సిపల్ కుప్పా శివ సుబ్రమణ్య అవధాని, ఆగమ విభాగ అధ్యక్షుడు విష్ణుభట్టాచార్యులు, డీన్ రజనీకాంత్ శుక్లా పాల్గొన్నారు.
ఘాట్‌లో టీటీడీ ఈఓ తనిఖీలు
తిరుమల:తిరుమల రెండో ఘాట్ రోడ్డులో టీటీడీ ఈఓ శ్యామలారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అవసరమైన చోట మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్డులో తగినంత సిబ్బందిని నియమించి తరచూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని హెల్త్ విభాగం అధికారులకు సూచించారు.
పోలీసు కుటుంబాలకు
ఆర్థిక సాయం
తిరుపతి క్రైమ్ : విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు సంబంధించి వారి కుటుంబాలకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. అందులో హెడ్ కానిస్టేబుల్ కామరాజు సతీమణి లక్ష్మి, కానిస్టేబుల్ అశోక్ తండ్రి గోపాల్‌కు చెక్కులను పంపిణీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హెడ్‌కానిస్టేబుల్ రోశయ్యకు వెల్ఫేర్ ఫండ్ కింద రూ.లక్ష వడ్డీ లేని రుణం మంజూరు చేశారు.

వేద సదృశ్యం.. ఆగమశాస్త్రం

వేద సదృశ్యం.. ఆగమశాస్త్రం