
21న గూడూరులో జాబ్‌మేళా
తిరుపతి అర్బన్ : జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన గూడూరు డీఆర్‌డబ్ల్యూ డిగ్రీ కళాశాలలోజాబ్ మేళా నిర్వహించనున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ పోస్టర్ ఆవిష్కరించారు. 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సుల పూర్తి చేసిన మేళాకు అర్హులుగా పేర్కొన్నారు. 20వ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అదనపు సమాచారం కోసం 9985056929, 8639835953,9988853335 నంబర్లను సంప్రదించాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాథం పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 20న ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు.