ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను ! | - | Sakshi
Sakshi News home page

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

Aug 17 2025 7:31 AM | Updated on Aug 17 2025 7:31 AM

ఇచ్చి

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

70 శాతం సీట్లు మహిళలకే అంటున్న అధికారులు

ఆ లెక్క బాగోలేదంటున్న పురుషులు

అధికారుల్లోనూ స్పష్టత లేని ‘సీ్త్రశక్తి’ ఉచిత పథకం

పరిశ్రమల్లో పనిచేస్తున్న వేల మంది కార్మికులు యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఒప్పుకొని విలవిల్లాడుతున్నారు.

ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025

అమ్మా.. ఆగండి పసుపు రంగు ఉండే బస్సులనే చూసి ఎక్కండి.. అంటూ ఆర్టీసీ అధికారులు మహిళలకు సూచిస్తున్నారు. అదేంది..ఎన్నికల్లో ఏ బస్సు అయినా ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఉచితం అని చెప్పారు.. మరి ఈ కండీషన్లు ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొన్ని రూట్‌లలో బస్సులు లేకపోవడంతో తిరుపతి బస్టాండ్‌తో పాటు అన్ని మార్గాల్లోనూ ప్రయాణికులు అవస్థలు పడ్డారు. గంటల కొద్దీ బస్టాండ్లలో నిరీక్షించారు. జిరాక్స్‌ కాపీలు బస్సుల్లో అనుమతించకపోవడంతో మహిళలు పలుచోట్ల కండక్టర్లతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఉచిత ప్రయాణంపై అధికారులకే స్పష్టత లేకపోవడంపై కొంత సందిగ్ధం నెలకొంది.

కొత్తగా 136 రూట్లలో ఆర్టీసీ అంటూ సిస్టమ్‌ పెట్టడంతో బస్సుల కొరతతో తిరుపతి బస్టాండ్‌లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు

అధికారుల లెక్కలు ఇలా..

ఆర్టీసీ బస్సులు జిల్లా వ్యాప్తంగా నడుపుతున్న రూట్ల అంశంలో అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 11 డిపోల పరిధిలో 855 బస్సులు 177 రూట్లలో(మార్గాల్లో) నడుస్తున్నాయి. రోజుకు సుమారుగా 3.39 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. దీంతో రోజు వారీగా 2.70 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేయడంతో రూ.1.70 కోట్ల రాబడి వస్తుంది. అయితే 177 రూట్లలో 136 మార్గాల్లో ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. దీంతో ఇతర మార్గాల్లో బస్సులు లేకపోవడంతో తిరుపతి బస్టాండ్‌తో పాటు అన్ని మార్గాల్లోనూ ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. గంటల కొద్ది బస్టాండ్లలో వేచి ఉంటున్నారు.

పడిగాపుల

70 శాతం సీట్లు మహిళలకే చెప్పడం సరికాదు

పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సాధారణ ఎక్స్‌ప్రెస్‌ల్లో 70 శాతం సీట్లు మహిళలకు వదిలిపెట్టాలని చెప్పడం సరికాదు. మహిళలకు అయితే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పురుషులు అయితే టిక్కెట్‌ తీసుకుంటారు. అక్కడి వరకు ఓకే. అంతేతప్ప 70 శాతం సీట్లు వదిలిపెట్టాలని చెప్పడం మంచి పద్ధతి కాదని భావిస్తున్నాం. – అత్తిరాల సురేష్‌, వరదయ్యపాళెం

అన్ని బస్సుల్లో అవకాశం ఇవ్వాలి

ఆర్టీసీకి చెందిన అన్నీ బస్సుల్లో అవకాశం ఇవ్వా లని కోరుతున్నాం. ఎన్నికల సమయంలో ఇలా మూడు బస్సుల్లోనే ఉంటుందని చెప్పలేదు. అలా గే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అవకాశం కల్పించాలి. విజయవాడకు తిరుపతి మహిళలు వెళ్లాలంటే పల్లె వెలుగులో 10 బస్సులు మారాల్సి ఉంటుంది. నాలుగు రోజులు సమయం పడుతుంది.

– యశోధ, తిరుపతి కొర్లగుంట

ఒరిజనల్‌ కార్డులు చూపించాలి

గుర్తింపు కార్డు విషయంలో ఒరిజనల్స్‌ కార్డులను కండక్టర్లకు చూపాల్సి ఉంది. శనివారం శ్రీకాళహస్తి, కాణిపాకం, రాయచోటి తదితర కొన్ని మార్గాల్లోనే ప్రయాణికులు బస్సుల కోసం కొంత సమయం వేచి ఉన్నారు. బస్సుల కొరత లేకుండా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. 33 శాతం సీట్లు మాత్రం పురుషులు కూర్చోడానికి వీలులేదు. కూర్చున్నా మహిళలు వస్తే లేయాల్సిందే. వాటికి మాత్రమే పసువు రంగు వేశాం. – జగదీష్‌, జిల్లా ప్రజా రవాణా అధికారి

తిరుపతి అర్బన్‌ : పసువు రంగు ఉండే సర్వీసుల్లోనే మహిళలకు ఉచితమంటున్నారు ఆర్టీసీ పెద్దలు. కాస్త చూసి ఎక్కండి అంటూ సలహాలు ఇచ్చేస్తున్నారు. కూటమి సర్కారు ప్రకటించిన పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సాధారణ ఎక్స్‌ప్రెస్‌లకు పసుపు రంగులు వేయించారు. మరోవైపు అనుమతి లేని సర్వీసులకు బస్సుపైన సీ్త్రశక్తి పథకం వర్తించదు అంటూ స్టిక్కర్లు వేయిస్తున్నారు. ఆ మేరకు స్టిక్కర్లు రెండు రోజుల్లో...ఉచిత బస్సుకు అనుమతులు లేని అన్నీ సర్వీసుల్లోపైన ఉండాలంటూ జిల్లా ఆర్టీసీ ఆధికారులు జిల్లాలలోని 11 డిపోల మేనేజర్లుకు ఆదేశాలు ఇచ్చేశారు. ఇంకోవైపు ఉచితం కోసం కేటాయించిన బస్సుల్లో 70 శాతం మహిళలకే అవకాశం ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పురుషులు మండిపడుతున్నారు.

ఉచిత బస్సు స్కీమ్‌ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకు 2,826 మంది ఉచిత బస్సు పథకాన్ని మహిళలు వినియోగించుకున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు 1,70,894 మంది ప్రయాణికులు ఆర్టీసీలో జర్నీ చేసినట్లు ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఒక్కో రోజు ఒక్కో రూల్స్‌ పెడుతున్నారు. జిల్లా స్థాయిలోని ఆర్టీసీ అధికారులకు సీ్త్రశక్తి స్కీమ్‌పై స్పష్టత రావడం లేదు.

ఒరిజనల్‌ గుర్తింపు కార్డులు చూపాలి..

ఆధార్‌, రేషన్‌, ఓటరు కార్డు ఇలా ఏదై నా ఒరిజనల్‌ కార్డును మహిళలు చూపిస్తేనే ఉచితంగా ప్రయాణం చేయడానికి అనుమతి ఇస్తామని కండక్టర్లు చెబుతున్నారు. దీంతో శనివారం పలు మార్గా ల్లో వివాదాలు చోటు చేసుకున్నాయి.

బస్టాండ్‌లో బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ

బస్టాండ్లలో ప్రయాణికుల

నిరీక్షణ

పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయండి

ఏళ్ల తరబడి తిరుమలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. మాకు వచ్చే జీతాల్లో 50 శాతం బస్సు చార్జీలకే సరిపోతుంది. అయితే ఎన్నికల సమయంలో మహిళలకు ఉచితం అంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు తిరుమలకు లేదంటే...మేము చార్జీలు చెల్లించి తిరుమలకు వెళుతున్నాం. ఇది ఎక్కడ న్యాయమో చెప్పాలి. – సులోచన, పారిశుద్ధ్య

కార్మికురాలు, తిరుపతి ప్రయాణికురాలు

జిరాక్స్‌ పత్రాలకు అనుమతి ఇవ్వాలి

ఆర్టీసీ అధికారులు పసుపు రంగు చూసి..బస్సు ఎక్క మని చెబుతున్నారు. గుర్తింపు కార్డులు ఒరిజనల్‌ కార్డు లు ఇవ్వాలని అడుగుతున్నా రు. మొబైల్స్‌ చూపినా, జిరా క్స్‌ ఇచ్చినా చెల్లవని చెప్పడం సరికాదు. ఒకసారి ప్రయాణానికే ఆధార్‌ కార్డును పోగొట్టుకుంటున్నారు. తర్వాత మళ్లీ ఆధార్‌కార్డు కోసం రూ.100 చెల్లించి తీసుకుంటున్నాం. పోన్లులో చూపించినా, జిరాక్స్‌లు చూపించినా అవకాశం కల్పించాలని కోరుతున్నాం. –చెంగయ్య, వాకాడు

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !
1
1/9

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !
2
2/9

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !
3
3/9

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !
4
4/9

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !
5
5/9

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !
6
6/9

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !
7
7/9

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !
8
8/9

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !
9
9/9

ఇచ్చింది తీసుకో.. పెట్టిందే తిను !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement