
టీడీపీ నేత జోక్యం
టెండర్ నిర్వహిస్తున్న సమయంలో మఠం ముందున్న దుకాణదారులు టీడీపీ నేతను రంగంలోకి దించారు. మరికొందరు రాజకీయ నాయకులతో కలిసి పరిపాలన అధికారి బాపిరెడ్డితో వాదించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దుకాణదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి టెండరు ప్రక్రియ నిర్వహించాలంటూ చేసిన హెచ్చరికలు టెండర్ ప్రక్రియకు హాజరైన వారిని ఆలోచనలో పడేశాయి. దీంతో తాము కట్టిన డబ్బులను మాకు తిరిగి ఇవ్వాలని అడిగారు. ఒకవేళ టెండర్ దక్కించుకున్న తర్వాత పనులు జరగనివ్వకుండా అడ్డుపడితే తాము కట్టిన డబ్బుకు, అప్పుడు ఎదురయ్యే పరిస్థితికి ఎవరు సమాధానం చెబుతారని భయాందోళన టెండర్ దారుల్లో వ్యక్తమైంది. పరిపాలన అధికారి బాపిరెడ్డి కలగజేసుకొని వారికి నచ్చజెప్పి టెండర్ ప్రక్రియను సజావుగా సాగేలా కృషి చేశారు.