బోసిపోయిన కళాశాలలు | - | Sakshi
Sakshi News home page

బోసిపోయిన కళాశాలలు

Aug 16 2025 8:36 AM | Updated on Aug 16 2025 8:36 AM

బోసిప

బోసిపోయిన కళాశాలలు

తిరుపతి సిటీ: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు విద్యార్థుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్వాతంత్య్ర దిన వే డుకలు చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకున్నట్లు కనిపించలేదని అధ్యాపకులు చర్చించుకోవడం గమనార్హం. వరుసగా మూడు రోజుల సెలవు లు రావడంతో హాస్టల్‌ విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతోపాటు డిగ్రీ, పీజీ మొదటి ఏడాది కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టకపోవడం మరో కారణమని తెలుస్తోంది. అన్ని కళాశాలలోనూ కేవలం ఎన్‌సీసీ క్యాడెట్లతోనే స్వాతంత్య్ర వేడుకలు తూతూ మంత్రంగా జరుపుకోవడం విశేషం.

అవయవదానం

నాగలాపురం: మండలంలోని వినోభానగర్‌ గ్రామానికి చెందిన గంగన్‌(55) శుక్రవారం బ్రైయిన్‌ డెడ్‌ అయినట్లు చైన్నె ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతుని అవయవాలను దానం చేయడానికి అతని భార్య మంజుల అంగీకారం తెలిపింది. దీంతో వైద్యులు రెండు కిడ్నీలు, ఓ ఎముకను ఆపరేషన్‌ చేసి, తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

15వ జాతీయ హాకీ

పోటీలకు గూడూరు విద్యార్థి

చిల్లకూరు: గూడూరు పట్టణం చర్చివీధికి చెందిన దేవతా య శ్వంత్‌ అనే ఇంటర్‌ విద్యార్థి 15వ జాతీ య స్థాయి జూనియర్‌ హాకీ పోటీలకు ఎంపికై నట్లు హాకీ కోచ్‌ ఆకాష్‌దీపక్‌ శుక్రవారం తెలిపారు. ఈ క్రీడాకారుడు పంజాబ్‌ రాష్ట్రంలోని జలందర్‌లో ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు జరిగే జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో రాష్ట్ర జట్టులో సభ్యుడిగా పాల్గొంటారని కోచ్‌ తెలిపారు. ఈ నెల 18న జరిగే పోటీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో శ్రీలక్ష్మి చారిబుల్‌ట్రస్టు నిర్వాహకులు శ్రీలక్ష్మి, పీఎంరావు తమవంతు ఆర్థిక సహకారం అందించారు. ఇతడి ఎంపికపై హాకీ అసోసియేషన్‌ తిరుపతి అధ్యక్షుడు టీ స్పర్జన్‌రాజు తదితరులు అభినందనలు తెలిపారు.

విచ్చలవిడిగా మద్యం..

మాంసం విక్రయాలు

రేణిగుంట: మండలంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున మద్యం, మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగాయి. మందు బాటిల్‌పై రూ.50 అధికంగా వసూలు చేస్తూ తమ వ్యా పారం కొనసాగించారు. కరకంబాడిలో ప్రధా న రహదారిపైనే చికెన్‌ దుకాణాలు తెరిచి అధిక ధరతో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. అరికట్టాల్సిన ఎకై ్సజ్‌ శాఖ, పంచాయతీ, పోలీస్‌శాఖ అధికారులు మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదనేలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

శ్రీవారి సర్వదర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది. గురువారం అర్ధరాత్రి వరకు 66,530 మంది స్వామివారిని దర్శించుకోగా 32,478 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉండగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది.

బోసిపోయిన కళాశాలలు 
1
1/3

బోసిపోయిన కళాశాలలు

బోసిపోయిన కళాశాలలు 
2
2/3

బోసిపోయిన కళాశాలలు

బోసిపోయిన కళాశాలలు 
3
3/3

బోసిపోయిన కళాశాలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement