
వివాహ పరిచయ వేదిక రేపు
– 8లో
తిరుపతిలో ఈ నెల 17వ తేదీన వివాహ పరిచయ వేదిక జరగనున్నట్టు ఆ సంఘం అధ్యక్షుడు సుబ్రమణ్యం తెలిపారు.
సాంకేతిక పరంగా భారత్ గ్లోబల్ మ్యాప్‌లోకి..
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేస్తున్న ప్రయోగాల పరంపరతో దేశంలో ప్రతి ఒక్కరికీ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి నేడు గ్లోబల్ మ్యాప్‌లో భారత్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చామని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ పేర్కొన్నారు. షార్‌లోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో 79వ స్వాతంత్య్ర దిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ మన జాతీయజెండా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్బంగా సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ సందీప్‌కుమార్ ఆధ్వర్యంలో భద్రతా దళాలు గౌరవ వందనం సమర్పించారు.
షార్‌లో మువ్వన్నెల
జాతీయజెండాను ఎగురవేస్తున్న
షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్