
ఎమ్మెల్సీ మేరిగకు పితృవియోగం
చిల్లకూరు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌కు పితృవియోగం కలిగింది. రాపూర్‌నకు చెందిన మేరిగ ఆనందరావు (89) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఆయన అకస్మాత్తుగా చివరి శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని రాపూరులోని ఆయన స్వగృహానికి నెల్లూరు నుంచి తరలించారు. అంతిమ యాత్ర శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటి వద్ద నుంచి బయలుదేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆనందరావు వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ కొంత రాజకీయ పరిణితి ఉన్నవాడు కావడంతో చదువుతోనే దానిని సాధిచగమని గుర్తించి తన ఐదుగురి సంతానంలో ముగ్గురు కుమారులను వైద్యవృత్తిని చేయించారు. ఈ క్రమంలోనే మేరిగ మురళీధర్‌ను ఉన్నత చదువులు చదివించిన తరువాత ఆయనకు ఇష్టమైన రాజకీయాలలోకి పంపి నేడు ఉన్నతమైన స్థానంలో ఉండేలా ప్రోత్సహించారు. ఆనందరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు మేరిగ మురళీధర్‌కు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.