
కలెక్టర్‌కు ‘స్కోచ్’ అవార్డు
తిరుపతి అర్బన్ : స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంలో కలెక్టర్ వెంకటేశ్వర్, బృందం కృషికి స్కోచ్ పురస్కారం దక్కనుంది. బుధవారం ఈ మేరకు స్కోచ్ గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ దలాల్ అవార్డును ప్రకటించారు. సెప్టెంబర్ 20వ తేదీన న్యూఢిల్లీలో కలెక్టర్ వెంకటేశ్వర్ అవార్డును అందుకోనున్నారు.
‘సీకామ్’కు అటానమస్ హోదా
తిరుపతి సిటీ:తిరుపతి అన్నమయ్య సర్కిల్‌లోని సీకామ్ డిగ్రీ కళాశాలకు యూజీసీ అటానమస్ హోదా కల్పించిందని ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతినాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యానికి అధికారిక ఉత్తర్వులు అందించారు. కళాశాలకు ఐదేళ్ల పాటు అటానమస్ హోదా వర్తిస్తుందని పేర్కొన్నారు.
8 టిప్పర్ల సీజ్
తడ: తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న 8 టిప్పర్లను బీవీపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు బుధవారం సీజ్ చేశారు. మట్టి స్మగ్లింగ్‌కు కూటమి నేతల అండదండలున్నట్లు తెలిసింది. వారిలో విభేదాల కారణంగానే టిప్పర్లలో గ్రావెల్ తరలుతున్న విషయం అధికారులకు గుట్టుగా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
తిరుపతి క్రైమ్ : తిరుపతి రైల్వేస్టేషన్ 3వ నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద కదులుతున్న రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. వివరాలు.. ఉదయం 11:30 గంటల సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా పరిగెత్తుకెళ్లి బయలుదేరుతున్న రైలు కింద పడిపోయాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని రైల్వేపోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించాలని వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9440352765 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.

కలెక్టర్‌కు ‘స్కోచ్’ అవార్డు