
డ్రోన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి కృషి
తిరుపతి సిటీ : ఎస్వీయూలో డ్రోన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని వీసీ సీహెచ్ అప్పారావు తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో బుధవారం వర్సిటీలో రిమోట్ ఫైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ మంజూరు కోసం పలు సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు స్పేస్ టెక్నాలజీ, డ్రోన్‌న్– స్పేస్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, వర్చువల్ ప్రొడక్షన్, సెమీ కండక్టర్స్ వంటి సాంకేతికతలకు టెక్నాలజీ లెర్నింగ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ శిక్షణ వసతులను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు డ్రోన్ సిమ్యులేటర్ సాఫ్ట్‌వేర్‌తో ప్రాక్టీస్, క్లాస్ రూమ్ సౌకర్యాల కోసం గ్రౌండ్‌ను తనిఖీ చేసినట్లు వివరించారు. రిజిస్ట్రార్ భూపతినాయుడు, డ్రోన్ డైరెక్టరేట్ ప్రణవ్, ఏరోస్పేస్ లిమిటెడ్ డైరెక్టర్ అంజలి, డిప్యూటీ డైరెక్టర్ ఆపరేషన్స్ కుంజలత, చేతల్ సింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ కో–ఆర్డినేటర్ ఆచార్య ధర్మారెడ్డి, రుసా సీఈఓ వంశీకృష్ణ పాల్గొన్నారు.