
వరిసాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి
పాకాల: రైతులు రబీలో చేపట్టనున్న వరి సాగులో యాజమాన్య పద్ధతులను పాటించాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి కేవీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మండలంలోని మొగరాల రైతు సేవా కేంద్రంలో రైతులకు వ్యవ సాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా అందించే పీఎండీఎస్ కిట్లతోపాటు రైతులకు ఇస్తున్నా పలు పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని తెలి పారు. అనంతరం ఏఓ హరిత మాట్లాడుతూ వరిలో సహజ ఎరువు లు, కషాయాల వాడడంతో అధిక దిగుబడితో పాటు నాణ్యమైన ఉత్ప త్తిని సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సి.మహేష్, సర్పంచ్ మధునాయుడు, మాజీ సర్పంచ్ ఆనందచౌదరి పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
లారీ డ్రైవర్ మృతి
శ్రీకాళహస్తి: విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో బుధవారం చోటు చేసుకుంది. రెండో పట్టణ పోలీసుల కథనం మేరకు.. పిచ్చాటూరు మండలం కీళ్లపూడి గ్రామానికి చెందిన చిరంజీవి(35) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో రేణిగుంట నుంచి శ్రీసిటీకి కంటైనర్‌ను తరలిస్తుండగా పట్టణంలోని భక్తకన్నప్ప సర్కిల్ వద్ద విద్యుత్ తీగలు కంటైనర్‌కు తగలడంతో విద్యుతషాక్‌కు గురైన చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టారు.
లారీ బోల్తా
రేణిగుంట: మండలంలోని మర్రిగుంట ప్రధాన కూడలిలో బుధవారం తెల్లవారుజామున క్యాబేజీ లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా పడింది. బెంగళూరు నుంచి కోల్‌కతాకు లారీ క్యాబేజీ లోడ్‌తో వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వెనుక నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఉద యం క్యాబేజీని మరో లారీలోకి మార్చి క్రైయిన్‌తో బోల్తా పడిన లారీని పక్కకు తప్పించి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

వరిసాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి