
మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డికి నివాళి
శ్రీకాళహస్తి: జిల్లాలో సీనియర్ పొలిటీషియన్, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి పార్థివదేహానికి పలువురు నేతలు నివాళులు అర్పించారు. మంగళవారం ఆయన స్వగృహంలో మృతదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. అన్ని పార్టీల నాయకులు, స్నేహితులు, బంధువులు, ప్రజలు, భారీగా తరలివచ్చి ఆయన పార్థి వ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, గుమ్మడి బాలకృష్ణయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ ఫరీద్, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీవారి సురేష్, దేవస్థానం మాజీ బోర్డు మెంబర్లు మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యామ్ రాయల్ తదితరులు ఉన్నారు. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా మాజీ ఎమ్మె ల్యే చెంచురెడ్డి మృతదేహానికి నివాళి అర్పించారు.