
గంగరంగ వైభవం
రేణిగుంట : నడివీధి గంగమ్మ దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం ఉదయం నుంచే ఆలయం వద్ద బారులు తీరారు. అమ్మవారిని సేవించుకుని పరవశించారు. ఈ క్రమంలో వేకువనే పసుపుతో చేసిన అమ్మవారి ప్రతిమను ఊరేగింపు తీసుకువచ్చి వేపాకు పందిరి కింద కొలువుదీర్చారు. ప్రత్యేక క్యూల ద్వారా భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంగమ్మను దర్శించుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.
భారీగా కుంభం
సాయంత్రం అమ్మవారికి కుంభం పెట్టి మొక్కు లు తీర్చుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. భైరాగి వేషాలతో దిష్టి కుండలను నెత్తి న పెట్టుకుని మహిళలు, చిన్నారులు సమూహాలు గా నడివీధి గంగమ్మను సేవించుకున్నారు. ఆల య కమిటీ చైర్మన్ సోలా మల్లికార్జునరెడ్డి నేతృత్వంలో భక్తులకు వసతులు కల్పించారు. అర్ధరాత్రి తర్వాత అమ్మవారి ప్రతిమను ఊరేగించారు. అనంతరం నిమజ్జనంతో జాతరను పరిపూర్ణం చేశారు.
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ముగిసిన రేణిగుంట నడివీధి
గంగమ్మ జాతర

గంగరంగ వైభవం

గంగరంగ వైభవం

గంగరంగ వైభవం