
శ్రీసిటీ–వీఆర్‌వీ పరిశ్రమ వితరణ
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీ ఫౌండేషన్ సహకారంతో శ్రీసిటీలోని చార్ట్–వీఆర్‌వీ పరిశ్రమ సామాజిక బాధ్యతలో భాగంగా వరదయ్యపాళెం మండలం నాగానందపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యా వసతులు సమకూర్చింది. సుమారు రూ.31 లక్షల వ్యయంతో తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గది నిర్మాణాలను పూర్తిచేసింది. స్కూల్ ఆవరణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించింది. మొక్కలు నాటి, స్కూల్ మొత్తానికి రంగులు వేయించింది. ఈ మేరకు బుధవారం శ్రీసిటీ డైరెక్టర్ నిరీషా సన్నారెడ్డి సమక్షంలో చార్ట్ ఇండస్ట్రీస్ ఎండీ పర్వేశ్ మిట్టల్, డైరెక్టర్ యామిని సిన్హా చేతులమీదుగా నూతన వసతులను ప్రారంభించారు. వీఆర్ హెచ్‌ఆర్ మేనేజర్ కందస్వామి, ఎంఈఓ–2 గున్నయ్య పాల్గొన్నారు.