
ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన
తిరుపతి అర్బన్: హెచ్‌ఐవీ పట్ల అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌తో పాటు వైద్యాధికారులతో కలసి హెచ్‌ఐవీని గురించి చర్చిద్దాం..హెచ్‌ఐవీని నివారిద్దాం అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి హెచ్‌ఐవీ వ్యాప్తి చెందకుండా చేపట్టాల్సిన అంశాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు.ఆ మేరకు అందరికి కరపత్రాలను అందించాలని సూచించారు.
జీవితాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు
తిరుపతి తుడా: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారి వారి ఆధ్వర్యంలో మంగళవారం హెచ్‌ఐవీ ఎయిడ్స్, మాదకద్రవ్య వ్యసనాలపై యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్ జెండా ఊపి ప్రారంభించారు. అంనతరం క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కోటి రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాల ను విచ్ఛినం చేసుకోవద్దన్నారు. ర్యాలీలో మెడిక ల్, స్వచ్చంద సేవ సంస్థల సిబ్బంది, యువత, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.