గతంలో పల్లెవించిన ప్రగతి
నాడు రైతుకు భరోసా ఉండేది
నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. జగనన్న ప్రభు త్వంలో ఏటా రూ.13,500 వచ్చేది. ఈ డబ్బులు పెట్టుబడికి సరిపోయేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క పైసా ఇవ్వలేదు. ఎన్నికల హామీలో ఇస్తామన్న రూ.20 వేలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. పెట్టుబడికి అప్పులు చేయాల్సి వస్తోంది. –మునిశేఖర్ యాదవ్,
రైతు, గాజులమండ్యం, రేణిగుంట మండలం
కళకళలాడుతున్న సచివాలయం
సుదీర్ఘ పాద యాత్ర అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే పెల్లె రూపురేఖలు మార్చేశారు. ప్రతి చిన్న పనికీ మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో గ్రామ సచివాలయాలను నిర్మించారు. ప్రతి 50 కుటుంబాలకు ఇంటివద్దకే పథకాలను, ప్రభుత్వ సంక్షేమాన్ని అందించేందుకు వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. రైతులకు గ్రామంలోనే రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులోకి తెచ్చారు. పంట కొనుగోళ్లను చేపట్టి రైతుకు గిట్టుబాటు ధర కల్పించారు. రైతు భరోసా పేరుతో పెట్టుబడి నిధి కింద ఏడాదికి రూ.13,500 అందించారు. రుణాలు, బీమాను పక్కాగా అమలు చేశారు. ప్రతి కుటుంబానికీ వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కూతవేటు దూరంలోనే విలేజ్‌హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. పేదలు, వృద్ధులకు ఉచిత మందులతో పాటు ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.25 లక్షల వరకు శస్త్ర చికిత్సలకు అవకాశం కల్పించారు. అమ్మఒడి పథకం కింద జిల్లాలో 3.4 లక్షల మందికి ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున అందించారు. మహిళా సంఘాలకు వడ్డీ రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్య, ఫీజురీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు చేతోడు వంటి పథకాలను అందించి ఆదుకున్నారు.
నాడు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి
నాడు–నేడు పథకం కింద గత ప్రభుత్వంలో పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశారు. మా ఊరులో ఉన్న ప్రాథమిక పాఠశాల అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉంది. గత ప్రభుత్వంలో అదనపు తరగతి గదులు కట్టించారు. కూటమి ప్రభుత్వం మా పాఠశాలను మూసివేసి కిలోమీటరు దూరంలోని హరిపురం కాలనీకి బదిలీ చేయాలని చూస్తోంది.
– మేర్లపాకు శివప్రసాద్, పేరూరు, తిరుపతి రూరల్
సొంతింటి కల నెరవేరింది
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాకాడు మండలం, సిద్ధిగుంటపాళెం గ్రామం వద్ద జగనన్న లేఔట్‌లో స్థలంతో పాటు కాలనీ ఇల్లు నిర్మించి ఇచ్చారు. అద్దె ఇంట్లో నుంచి మా సొంత ఇంట్లోకి వచ్చాం. ఎంతో సంతోషంగా ఉంది. – రాయుపు రాజేష్,
సుజన దంపతులు, వాకాడు మండలం
నెలబల్లిలో ప్రభుత్వ భవనాల సముదాయం
తనపల్లిలో ఒకేచోట ఏర్పాటు చేసిన
గ్రామస్థాయి కార్యాలయాలు
గతంలో పల్లెవించిన ప్రగతి
గతంలో పల్లెవించిన ప్రగతి
గతంలో పల్లెవించిన ప్రగతి
గతంలో పల్లెవించిన ప్రగతి
గతంలో పల్లెవించిన ప్రగతి
గతంలో పల్లెవించిన ప్రగతి


