తిరుపతి జిల్లా స్టేట్ ఫస్ట్
తిరుపతి అర్బన్: రోడ్డు ప్రమాదాల్లో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందని, ప్రమాదాల నివారణకు పలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి(డీపీటీఓ) జగదీష్ ఆర్టీసీ డ్రైవర్లను ఆదేశించారు. తిరుపతిలోని డీపీ టీఓ కార్యాలయంలో ఆర్టీసీ డ్రైవర్లు, అన్‌కాల్ డ్రైవర్లు, హైయర్ బస్సు డ్రైవర్లకు శు క్రవారం ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్లు 1,450 మంది. అన్‌కాల్ డ్రైవర్లు(కాంట్రాక్) 260 మంది, హైయర్ బస్సు డ్రైవర్లు 440 మంది(అద్దె బస్సు డ్రైవ ర్లు)కు ప్రమాదాల నివారణపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. డ్రైవర్లకు టార్గెట్ ఇవ్వడంతోనే దూకుడుగా డ్రైవింగ్ చేస్తున్నారని, టార్గెట్ తొలగిస్తే దూకుడు తగ్గించి ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తారని ఈ సందర్భంగా కొందరు డ్రైవర్లు తెలిపారు.
అమ్మవారి సేవలో తమిళనాడు గవర్నర్
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావ తి అమ్మవారిని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ డిప్యూ టీ ఈఓ హరీంద్రనాథ్ స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద మొక్కుకుని అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు.
అమ్మవారి సేవలో ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్‌కు తిరుచానూరు పత్రిక విలేకరులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయన్ను సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.
ఏపీ ఎన్‌జీఓ ఎన్నికలు ఏకగ్రీవం
తిరుపతి అర్బన్: నగరంలోని ఏపీ ఎన్‌జీఓ కార్యాలయంలో శుక్రవారం నూతన అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికల అధికారిగా ఎన్‌జీఓ సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి శ్రీనివాసన్, రాష్ట్ర పరిశీలకులుగా జగదీష్ వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా సురేష్‌బాబు, సహా అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసులు, చలపతి నాయక్, గిరిబాబు, నాగరాజు కుమార్, హేమగిరి, మహిళ ఉపాధ్యక్షురాలిగా ప్రేమలత, జిల్లా కార్యదర్శిగా రఘు, కార్య నిర్వహక కార్యదర్శిగా రమణయ్య, సంయుక్త కార్యదర్శులుగా శ్రీరాములు, శ్రీధర్, లోకనాథ్ బాబు, చెన్నకేశవులు, మైథిలి, సంయుక్త కార్యదర్శి పద్మజ, జిల్లా కోశాధికారిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు.
తిరుపతి జిల్లా స్టేట్ ఫస్ట్
తిరుపతి జిల్లా స్టేట్ ఫస్ట్
తిరుపతి జిల్లా స్టేట్ ఫస్ట్


