విజ్ఞాన సమ్మేళనాన్ని తప్పక వీక్షించాలి
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత యూనివర్సిటీలో నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని విద్యార్థులు తప్పక వీక్షించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. శుక్రవారం వర్సిటీలో ప్రారంభభమైన కార్యక్రమాన్ని ఆయన స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమ్మేళనంలో ఎగ్జిబిషన్ స్టాళ్లు, వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేశారని, ఇవి విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, పరిశోధనాత్మక దృష్టిని మరింత పెంపొందించేలా ఉన్నా యని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల నుంచి ప్రతిరోజు 3 వేల మంది విద్యార్థులు, వారితోపాటు ఉపాధ్యాయులు, సందర్శించడానికి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని మిగిలిన అన్ని మండలాల నుంచి వీలున్న ప్రతి ఒక్కరూ తప్పక విచ్చేసి ఈ ప్రదర్శనను వీక్షించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.


