చెరువులో పడి వృద్ధురాలి మృతి
చిట్టమూరు: మండలంలోని మల్లాం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు చెరువులో పడి మృతి చెందిన సంఘటన శు క్రవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. మల్లాం గ్రామా నికి చెందిన జయం సుందరమ్మ (85) భర్త వెంకయ్య కు ఉద యం భోజనం పెట్టి బయటకు వెళ్లి వస్తా నని చెప్పి వెళ్లిందన్నారు. అయితే ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రవర్తనతో మనసు కలత చెందిన సుందరమ్మ గ్రామంలోని చెరువులో దిగి మృతి చెందిన ట్లు పేర్కొన్నారు. చెరువు వైపు వెళుతున్న వారు మృతదేహం నీటిపై తేలాడుతూ ఉండడాన్ని గమనించి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమా చారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నీటిపై తేలాడుతున్న మృత దేహాన్ని బయటకు తీయించడంతో గ్రామానికి చెందిన సుందరమ్మగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని తెలంగాణ వాసి మృతి
రేణిగుంట:మండలంలో ని ఆర్ మల్లవరం సమీపంలోని జాతీయ రహ దారిపై గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వా హనం ఢీకొనడంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన మధుసూదన్ (70) ట్రావెల్ బస్సు డ్రైవింగ్ చేస్తుంటాడు. ఆ క్రమంలో యాత్రి కులను తీసుకుని తి రుమలకు వస్తుండగా ఆర్.మల్లవరం సమీపంలో రోడ్డు పక్కన బస్సు ఆపి రోడ్డుకి అటు వైపు ఉన్న ప్రైవేట్ లాడ్జిలో రూమ్‌ల కోసం విచారించి, తిరిగి బస్సు వద్దకు వచ్చే ప్రయత్నంలో రోడ్డు దాటు తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహ నం అతన్ని ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై శుక్రవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.
చెరువులో పడి వృద్ధురాలి మృతి


