అర్జీదారుల కోసం ఎదురు చూపు!
తిరుపతి అర్బన్: అర్జీదారుల కోసం అధికారులు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు లేక కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. మొత్తం 257 వినతులు రాగా అందులో 155 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వచ్చాయి. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులుతోపాటు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ దేవేంద్రరెడ్డి, రోస్‌మాండ్ తదితరులు అర్జీలు స్వీకరించారు.


