అంతులేని సాగరంలో ఆటుపోట్లను ఎదుర్కొనే మత్స్యకారులను చంద
మొండిచేయి చూపుతున్న
చంద్రబాబు ప్రభుత్వం
కేంద్రం నిధులతో
సరిపెట్టేందుకు యత్నం
●
చిల్లకూరు : జిల్లాలోని మత్స్యకారులకు బోట్లు, వలలు, ఇంజిన్లు రాయితీపై అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఏడాది క్రితం ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో సుమారు 450 మంది జాలర్లు ఆశగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే సర్కారు మాత్రం ఇప్పటికీ దీనిపై స్పష్టత ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది.
వాటా.. మాటే లేదు
మత్స్యకారులకు బోట్లు, ఇతర పరికరాలు అందించేందుకు వెచ్చించే మొత్తంలో ప్రధానమంత్రి మత్స్యకార యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60శాతం భరిస్తుంది. మిగిలిన 40శాతం రాయితీ నగదును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు సర్కారు ఈ విషయంలో మత్స్యకారుల నెత్తిన కుచ్చుటోపీ పెడుతోంది. 40శాతం రాయితీ నగదును గంగపుత్రులే చెల్లించాలని స్పష్టం చేసింది. అంత మొత్తం చెల్లించలేమని జాలర్లు ఆవేదన చెందుతున్నారు. చివరకు చేసేది లేక కనీసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 15శాతం అయినా భరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే డీజిల్ సబ్సిడీ కింద పడవ యజమానులకు ప్రతి నెలా చెల్లించే రూ.2,700లను కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడం లేదని వాపోతున్నారు.
జిల్లాలో సముద్ర తీరం 75 కి.మీ
మత్స్యకార గ్రామాలు 42
ప్రస్తుతం ఉన్న పడవలు 821
సబ్సిడీ బోట్ల కోసం వచ్చిన దరఖాస్తులు 450
మత్స్యకారులకు అందని సబ్సిడీ
డీపీఆర్ ఇచ్చాం
జిల్లాలోని మత్స్యకారుల వివరాలను సేకరించాం. బోట్లు అవసరమైన వారి వివరాలను డీపీఆర్‌లో పొందుపరిచాం. ఈ మేరకు నివేదికను కలెక్టర్‌కు అందించాం. రాయితీపై నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. – రాజేష్,
జిల్లా మత్స్యశాఖాధికారి, తిరుపతి
సబ్సిడీ ఇవ్వాలి
సముద్రంలో వేట సాగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి. బోట్లు, ఇతర సామగ్రి కొనుగోలుకు రాయితీ అందించాలి. కనీసం 75శాతం సబ్సిడీ ఇస్తే మిగిలిన మొత్తం బ్యాంకు రుణం తీసుకుంటాం.
– మునస్వామి, లైట్‌హౌస్, వాకాడు మండలం
అంతులేని సాగరంలో ఆటుపోట్లను ఎదుర్కొనే మత్స్యకారులను చంద


