ఆర్‌టీసీలో ప్రైవేటును సహించం
తిరుపతి అర్బన్ : కొత్త బస్సుల పేరుతో ఆర్‌టీసీలో ప్రైవేటు పల్లవి పాడితే సహించే ప్రసక్తే లేదని ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని ఓ కల్యాణ మండపంలో ఆర్టీసీ ఎన్‌ఎంయూఏ జిల్లా సమావేశం నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ బస్సులంటూ ప్రైవేటు వ్యక్తులకు కొనుగోలు చేసే అధికారం ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. మరోవైపు ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పించే 1–19 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 15వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎంయూఏ జిల్లా అధ్యక్షుడు డీవీఆర్ కుమార్, కార్యదర్శి బీఎస్ బాబు పాల్గొన్నారు.


