విష్ణు నివాసంలో చోరీ
తిరుపతి క్రైమ్ : తిరుమల దర్శనానికి వచ్చిన భక్తుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన విజయ్ భాస్కర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఈ క్రమంలో గురువారం విష్ణు నివాసానికి చేరుకుని సేద తీరుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతని బ్యాగులోని వస్తువులను దొంగతనానికి పాల్పడ్డారు. ఇందులో భాగంగా 32 గ్రాములు విలువ చేసే నల్లపూసల దండ, రూ.1,20,000 నగదు, 40 వేల రూపాయలు విలువచేసే మొబైల్ ఫోను చోరీకి పాల్పడినట్లుగా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


