భావప్రకటనా స్వేచ్ఛపై ఎదురుదాడి
షార్‌లో భద్రత కట్టుదిట్టం
సూళ్లూరుపేట: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శనివారం సీఐఎస్‌ఎఫ్ డీఐజీ సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్, సబ్‌మైరెన్ పోలీస్ శాఖలతో షార్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రతపై పలు అంశాల గురించి చర్చలు జరిపారు. భారత్–పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో షార్ కేంద్రాన్ని కాపాడుకోవడానికి భద్రతా సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నారు. షార్ కేంద్రంలో పనిచేస్తున్న భద్రతా సిబ్బందికి సెలవులను రద్దు చేశారు. సెలవుల్లో ఉన్న వారిని కూడా అందరినీ రప్పించారు. షార్‌లో ఉన్న రాడార్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
శనివారం గేట్ నం.1బీ వద్ద సుమారు 70 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో మాక్‌డ్రిల్ నిర్వహించినట్టు సీఐఎస్‌ఎప్ డీఐజీ సంజయ్‌కుమార్ తెలిపారు. సీఐఎస్‌ఎప్ సీనియర్ కమాండెంట్ సంజిత్‌కుమార్, డిప్యూటీ కమాండెంట్ ఎన్‌కే.గౌర్, సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఇంటిలిజెన్స్ బ్యూరో అదికారులు, శ్రీహరికోట పోలీసుల, మైరెన్ పోలీసులు పాల్గొన్నారు.
భావప్రకటనా స్వేచ్ఛపై ఎదురుదాడి


