● జానపద కళాకారులు.. ఆ వేషాలు ఎక్కడ నాయకా? ● వేపాకు తోరణాలు లేవు.. డివిజన్‌కో అమ్మవారి విగ్రహం లేదు ● నాడు రోజూ ప్రతి డివిజన్‌ నుంచి అమ్మవారికి సారె ● నేడు కనిపించని నాటి సందడి.. ● కమిటీలపై ఉన్న శ్రద్ధ తిరుపతి గంగ జాతరపై లేదా? | - | Sakshi
Sakshi News home page

● జానపద కళాకారులు.. ఆ వేషాలు ఎక్కడ నాయకా? ● వేపాకు తోరణాలు లేవు.. డివిజన్‌కో అమ్మవారి విగ్రహం లేదు ● నాడు రోజూ ప్రతి డివిజన్‌ నుంచి అమ్మవారికి సారె ● నేడు కనిపించని నాటి సందడి.. ● కమిటీలపై ఉన్న శ్రద్ధ తిరుపతి గంగ జాతరపై లేదా?

May 10 2025 12:31 AM | Updated on May 10 2025 12:31 AM

● జాన

● జానపద కళాకారులు.. ఆ వేషాలు ఎక్కడ నాయకా? ● వేపాకు తోరణ

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరంటే.. అందో పెద్ద పండుగ. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గంగ జాతర గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చిన వారు కూడా ప్రత్యేకంగా చర్చించుకున్నారు. నాటి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు.. నేడు నిర్వహిస్తున్న గంగ జాతరకు ఎంతో తేడా కనిపిస్తోంది. ఆ నాటి సందడి నేడు కనిపించకపోవడంతో నగర ప్రజలే కాదు.. జాతరకొచ్చే వారంతా ఔరా..! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

శోభాయాత్ర అదో అద్భుతం

చాటింపు మరుసటి రోజు తిరుమల యాత్రకు ముఖద్వారమైన అనంత వీధి నుంచి శోభాయాత్ర నిర్వహించేవారు. ఈ యాత్రలో 150 కళాబృందాలు.. 1,400 మంది కళాకారులు పాల్గొనేవారు. యాత్ర వస్తుంటే.. నగరంలోని ప్రతి గడప ముందు కల్లాపు చల్లి, ముగ్గులు వేసి, పసుపు నీటితో స్వాగతం పలికేవారు.

వారం రోజుల పాటు జాతరే జాతర

చాటింపు రోజు నుంచి జాతర ముగిసే వరకు నగరంలోని ప్రతి డివిజన్‌లో సందడి కనిపించేది. ప్రతి డివిజన్‌లో అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి విచిత్ర వేషధారణలతో మొక్కులు చెల్లించుకునేవారు. గంగమ్మ తల్లిని నగర వాసులు ఇంటి ఆడబిడ్డగా భావించడంతో 50 డివిజన్ల నుంచి స్థానికు లు ఉదయం, సాయంత్రం ఊరేగింపుగా సారె తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించేవారు.

లక్ష కుంకుమార్చనేదీ?

ప్రతి ఏటా మేలో తిరుపతిలో నిర్వహించే తాతయ్యగుంట గంగ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. రాష్ట్ర పండుగగా గుర్తించి.. రాష్ట్ర ముఖ్యమంత్రే వచ్చి అమ్మవారికి సంప్రదాయ పద్ధతిలో సారె సమర్పించారు. ఇంకా ప్రముఖ పీఠాధిపతులు కూడా తిరుపతికి విచ్చేసి జాతర ప్రాశస్త్యం గురించి తెలియజేశారు.

కమిటీలపై ఉన్న శ్రద్ధ జాతరపై లేదే?

జాతర కోసం ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీలో చోటు కోసం జాబితాలను మార్చి మార్చి తన అనుచరులను నియమించారు. ఈ కమిటీలో చోటుకోసం కూటమి నేతలు పోటీలు పడి జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడిచేసి ప్రకటించిన జాబితాను మూడు సార్లు మార్పించారు. ఇంత చేసినా.. జాతరపై ఏ ఒక్కరికీ శ్రద్ధ లేదు. కమిటీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు ఉన్నా జాతర ఏర్పాట్ల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారం కోసం ఆరాటం తప్ప జాతర గురించి పట్టించుకునే నాథుడు కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు.

నాడు శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా తిరుపతితాతయ్య గుంట గంగమ్మ జాతరను నిర్వహించారు. అందులో భాగంగా జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి అంగరంగ వైభవంగా చేపట్టారు. జాతర నిర్వహణ కోసం నాడు ప్రభుత్వమే టీటీడీ నుంచి రూ.50 లక్షలు, కార్పొరేషన్‌ ద్వారా రూ.25 లక్షలు, తుడా నుంచి రూ.25 లక్షలతో పాటు సాంస్కృతిక శాఖ ద్వారా రూ.10 లక్షలు ఇప్పించింది. అందుకు తగ్గట్టే బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. చాటింపునకు ముందే తిరుపతి నగరమంతా వేపాకు తోరణాలు.. ఫ్లెక్సీలతో జాతరకు ఆహ్వానం పలికారు. నగరమంతా మైక్‌సెట్లు ఏర్పాట్లు చేసి జాతర విశేషాలు, గోవిందనామ స్మరణలు వినిపించేలా ఏర్పాట్లు చేశారు.

చాటింపు తర్వాత వచ్చే శుక్రవారం లక్ష కుంకుమార్చని నిర్వహించే కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గత ఏడాది భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ ఆలయంలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఆ కుంకుమను ప్యాకెట్లలో పెట్టి వలంటీర్ల ద్వారా ప్రతి నివాసానికీ అందజేశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతరలో లక్ష కుంకుమార్చన ఊసే లేకుండా పోయింది.

● జానపద కళాకారులు.. ఆ వేషాలు ఎక్కడ నాయకా? ● వేపాకు తోరణ1
1/2

● జానపద కళాకారులు.. ఆ వేషాలు ఎక్కడ నాయకా? ● వేపాకు తోరణ

● జానపద కళాకారులు.. ఆ వేషాలు ఎక్కడ నాయకా? ● వేపాకు తోరణ2
2/2

● జానపద కళాకారులు.. ఆ వేషాలు ఎక్కడ నాయకా? ● వేపాకు తోరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement