నాడు–నేడు..
ఆగిన మరమ్మతులు..సుందరీకరణ పనులు
అర్ధంతరంగా ఆగిన భవన నిర్మాణాలు
నిధులు లేవంటూ బాబు సర్కార్ డ్రామాలు
●
రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో పునాదులకే పరిమితమైన భవనం
తిరుపతి సిటీ: జిల్లాలో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకం కింద సర్కార్ బడుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు చంద్ర గ్రహణం పట్టింది. గత ప్రభుత్వం పాఠశాలల్లో చేపట్టిన భవనాల మరమ్మతు, సుందరీకరణ పనులు, నూతన భవనాలు, అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల కల్పన పనులు పలు పాఠశాలల్లో స్తంభించిపోయాయి. దీంతో ఆ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
లక్ష్యాన్ని నీరుగార్చిన బాబు సర్కార్
గత ప్రభుత్వం జిల్లాలో ఉన్న 2,939 ప్రభుత్వ పాఠశాలల్లో 2 వేలకు పైగా స్కూళ్లలో నాడు–నేడు పథకంలో అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో సుమారు 40 శాతం పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలోనే పనులు పూర్తికాగా, మిగిలిన పాఠశాలల్లో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పనులు స్థంభించి పోయాయి. నిధులు లేవంటూ చేతులెత్తేసిన బాబు సర్కార్ లక్ష్యాన్ని నీరుగార్చిందని ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు విమర్శిస్తున్నారు.
శిథిలావస్థకు చేరుకుంటున్న పాఠశాలలు
జిల్లాలోని 987 పాఠశాలల్లో నాడు–నేడు పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులకు బాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయక, ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 234 పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మౌలిక వసతుల కల్పన అర్ధంతరంగా ఆగిపోయింది. 85 పాఠశాలల్లో డిజిటలైజేషన్ పరికరాలు మూలన పడ్డాయి. 104 పాఠశాలల్లో భవన నిర్మాణపనులు రెండేళ్లుగా ఆగిపోవడంవతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.
నాడు–నేడు జిల్లా సమాచారం
మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 2,939
చదువుతున్న విద్యార్థులు 3,02,172
ఫేజ్–1లో ఎంపికైన పాఠశాలలు 837
ఫేజ్ – 2లో 1,047
ఫేజ్–1లో విడుదలైన నిధులు రూ.77.45కోట్లు
ఫేజ్–2లో.. రూ. 73.61కోట్లు
సుందరీకరణ ఆగిన పాఠశాలలు 985
మరమ్మతు ఆగిన పాఠశాలలు 763
ఆగిన అదనపు తరగతులు 104
శిథిలావస్థకు చేరుకుంటున్న భవనాలు 77
పూర్తికి అవసరమైన నిధులు 25.49 కోట్లు
సుందరీకరణకు చంద్రగ్రహణం
తిరుపతి వైఎస్సార్ మార్గ్, డీబీఆర్ రోడ్డులోని సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హైస్కూల్ పూర్తి స్థాయి నాడు నేడు ఫేజ్–1లో సుమారు 1.99 కోట్ల నిధులతో భవన నిర్మాణ దాదాపు పూర్తికాగా, కేవలం మరో రూ.5లక్షల నిధులతో పెయింటింగ్, ఫ్లోరింగ్, సుందరీకరణ పనులు పూర్తవుతాయి. కానీ పలు మార్లు అధికారులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు పట్టించుకున్న పాపన పోలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు నూతన తరగతి గదులు ఎప్పుడు వినియోగంలోకి వస్తాయని ఎదురు చూస్తున్నారు.
అనుపల్లి బడికి గ్రహణం
రామచంద్రాపురం: మండలంలోని అనుపల్లి ప్రాథమిక పాఠశాలలో నాడు–నేడు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పాఠశాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించినా, అవి సగంలో ఆగిపోయాయి. కాంట్రాక్టర్లు తెచ్చిన మెటీరియల్ అంతా ప్రాంగణంలోనే వృథాగా పడి ఉండడంతో తుప్పు పడుతోంది. పనులు ఆగిపోవడంతో శిథిలావస్థకు చేరిన భవనంలా కనిపిస్తోంది.
విద్యార్థులపై ప్రభుత్వం సవత ప్రేమ
సూళ్లూరుపేట మండలంలో ని దామనెల్లూరు జెడ్పీ హై స్కూలులో చేపట్టిన అదన పు భవనాలు సగంలో ఆగిపోయాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాబు సర్కారు పేద విద్యార్థులపై సవతి ప్రేమ చూపుతోంది. బాబు సర్కారు ఆగిన పనులు పూర్తి చేయాలి – ఎస్. హేమశంకర్, డేగావారి
కండ్రిగ గ్రామం, సూళ్లూరుపేట మండలం
విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి.. ఈ మాటను వేదంగా భావించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సర్కారు స్కూళ్లలో నాడు–నేడు పథకం అమలు చేశారు. అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే రాష్ట్రంలో రెండేళ్ల కిందట సర్కారు మారింది. బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన పేదల చదువుపై పగపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పనులు అర్ధంతరంగా ఆగిపోయేలా చర్యలు చేపట్టారు. అప్పట్లో నిర్మించ తలపెట్టిన భవనాల పనులు అర్ధంతరంగా ఆగిపోవడంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. వసతుల లేక సర్కారు చదువులు చతికిలపడుతున్నాయి.
సర్కార్ బడిలో
స్తంభించిన అభివృద్ధి
దాతలే దిక్కు
జిల్లాలోని సుమారు 765 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం నిధులు లేవంటూ నిర్లక్ష్యం చేస్తోంది. అధికారులు సైతం దాతలు ముందుకు రావాలని అంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం సర్కార్ బడుల అభివృద్ధికి దాతలే దిక్కు కావాల్సిరావడం ఆవేదన కలిగించే అంశం. – రామకృష్ణారెడ్డి,
విశ్రాంత ఉపాధ్యాయులు, తిరుపతి
నాడు–నేడు..
నాడు–నేడు..
నాడు–నేడు..
నాడు–నేడు..
నాడు–నేడు..


