ప్రమాదరహిత జిల్లాగా తిరుపతి
– ఆర్టీఏ కొర్రపాటి మురళీమోహన్
తిరుపతి అన్నమయ్యసర్కిల్:రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా తిరుపతిని చేయాలని, అందుకు వాహనచోదకులు నియయ నిభందనలు తప్పకుండా పాటించాలని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ (ఆర్టీఏ) పిలుపునిచ్చారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం స్థానిక రవాణా శాఖ అధికారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హోంగార్డులు, డ్రైవర్లకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల పాటు విధిగా రద్దు చేస్తామన్నారు. మోటార్ వాహన నియమ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు.


