4న ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

4న ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్‌ జట్ల ఎంపిక

May 2 2025 1:53 AM | Updated on May 2 2025 1:53 AM

4న ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్‌ జట్ల ఎంపిక

4న ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్‌ జట్ల ఎంపిక

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్‌ జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ (సీడీసీఏ) అధ్యక్షుడు బీ.విజయ్‌కుమార్‌, కార్యదర్శి ఎస్‌.రవికుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగా అండర్‌–19 బాలురు, అండర్‌–23 పురుషులు, అండర్‌–15 బాలికల జట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అండర్‌–19కు 01–09–2006, అండర్‌–23కు 01–09–2002 తరువాత జన్మించిన వారు, అండర్‌–15కు 01–09–2010 తరువాత 31–08–2012లోపు జన్మించిన వారు అర్హులని తెలిపారు. అర్హులైన క్రీడాకారులు తెల్లని దుస్తులు, సొంత క్రికెట్‌ కిట్‌, ఆధారు కార్డు, బర్త్‌ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సీడీసీఏ కోచ్‌ జీ.సునీల్‌కుమార్‌ను 90002 14966, సీడీసీఏ అసోసియేట్‌ సంయుక్త కార్యదర్శి ఎం.సతీష్‌యాదవ్‌ను 88861 85559 నంబర్లలో సంప్రదించాలని వారు సూచించారు.

ఎంపిక పోటీలు ఇక్కడే

చిత్తూరు, మదనపల్లి డివిజన్ల పరిధిలో వాల్మీకిపురంలోని జీవీఎస్‌సీఎస్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఉదయం 9గంటలకు అండర్‌–19(బాలురు), అండర్‌15(బాలికలు), మధ్యాహ్నం 2గంటలకు అండర్‌–23(పురుషులు), తిరుపతి డివిజన్‌కు సంబంధించి తిరుపతి, మంగళం రోడ్డులోని సీవీ క్రికెట్‌ అకాడమీలో ఉదయం 9 గంటలకు అండర్‌–19(బాలురు), అండర్‌15(బాలికలు), మధ్యాహ్నం 2గంటలకు అండర్‌–23(పురుషులు)జట్లు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.

ఆగని దాడులు

పాకాల: ఏనుగుల గుంపు గజగజలాడిస్తోంది. రాత్రి పూట అటవీ సరిహద్దు గ్రామాలపై పడి పంటలను సర్వనాశనం చేస్తోంది. ఇలాంటిదే మండలంలోని గానుపెంట గ్రామం, చినపాపయ్యగారిపల్లిలో చోటు చేసుకుంది. బుధవారం రాత్రి గానుగపెంట గ్రామానికి చెందిన యతీశ్వర్‌రెడ్డి వరి పంటను ధ్వంసం చేసింది. సుమారు లక్ష వరకు పంట నష్టం వాటిల్లింది. అలాగే మెహన్‌రెడ్డికి చెందిన ఎకరా వరి పంటను నాశనం చేయగా.. రూ.30 వేల పంట నష్టం వాటిల్లింది. మరో 20 మంది రైతుల పొలాలకు వేసిన ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసింది. చినపాపయ్యగారిపల్లిలో శివయ్యకు చెందిన మామిడి చెట్లు, పైపులైన్లను ధ్వంసం చేశాయి. సుమారు రూ.30 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని స్థానికులు కోరుతున్నారు.

రేపటి నుంచి యూజీ, పీజీకి దరఖాస్తులు

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో యూజీ (శాస్త్రి), పీజీ (ఆచార్య) కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. నాన్‌ ఎన్‌యూఈటీ (నేషనల్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) కింద వర్సిటీలో యూజీ, పీజీ కోర్సుల్లో 40శాతం సీట్ల భర్తీ కోసం ఆసక్తిగల అభ్యర్థులు శనివారం నుంచి జూన్‌ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఎన్‌ఎస్‌యూ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎన్‌యూఈటీ ప్రవేశ పరీక్ష ద్వారా వర్సిటీలో 60శాతం సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన 40శాతం సీట్ల భర్తీ కోసం రెండవ విడత కౌన్సెలింగ్‌ ద్వారా నేరుగా వర్సిటీ ఆధ్వర్యంలో యూజీ, పీజీ ప్రవేశాలను చేపట్టనున్నారు.

అధ్యాపకులకు అదనపు బాధ్యతలు

తిరుపతి సిటీ: ఎస్వీ వెటర్నరీ కళాశాలలో 2025–26వ విద్యా సంవత్సరానికి సంబంధించి పలువురు అధ్యాపకులకు కీలక పదవులు అప్పగించారు. ఈమేరకు అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జగపతిరామయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో బాయ్స్‌ హాస్టల్‌ వార్డెన్‌గా డాక్టర్‌ బి.రాంబాబునాయక్‌, బాలికల హాస్టల్‌ వార్డెన్‌గా డాక్టర్‌ ఆరే లక్ష్మీకవిత, ఓఎస్‌ఏగా డాక్టర్‌ వినోద్‌కుమార్‌, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ కె.సుధీర్‌ నియమితులయ్యారు. అలాగే యూజీ, పీజీ అకడమిక్‌ అడ్వైజర్స్‌గా డాక్టర్‌ ఆర్‌.వేణు, డాక్టర్‌ జి.గంగరాజును, బాయ్స్‌, బాలికల హాస్టల్‌ అడిషనల్‌ వార్డెన్లుగా డాక్టర్‌ తిరుపతిరెడ్డి, డాక్టర్‌ స్రవంతి, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆఫీసర్లుగా చైతన్యకుమార్‌, శ్వేతక్రాంతి, తేజ, శ్వేతని నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement