● ఎస్వీయూ సీఈగా బాధ్యతలు చేపట్టిన రాజమాణిక్యం
గాడిన పెట్టేనా?
తిరుపతి సిటీ: ఎస్వీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా డాక్టర్ రాజమాణిక్యం సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇంజినీరింగ్ విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా ఉన్న ఆయన ఎగ్జామినేషన్ సెక్షన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుర్రంకొండ శ్రీధర్, నెల్లూరు సుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు కోటగారం మురళి, సభ్యులు ఘనంగా సన్మానించారు.
ముళ్లకిరీటమే!
నూతన సీఈగా బాధ్యతలు చేపట్టిన రాజమాణిక్యంకు ఆ పదవి ముళ్లకిరీటం కానున్నట్లు వర్సిటీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎగ్జామినేషన్ సెక్షన్ అవినీతి మయంగా మారడం, ఇటీవల జరిగిన కొన్ని ఘటనలతో ఉద్యోగులను పెద్ద సంఖ్యలో బదిలీ చేశారు. గత కొన్ని నెలలుగా జరిగిన కొన్ని పీజీ, యూజీ కోర్సులకు వర్సిటీ ఫలితాలను విడుదల చేయ లేదు. నూతన సీఈ ఆయా పరీక్షల ఫలితాల విడుదలపై దృష్టి సారించాల్సి ఉంది.


