
వాకాడు: కడలి కల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి క్రమంగా పెరుగుతోంది. మంగళవారం వాకాడు మండలం, తూపిలిపాళెం వద్ద సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. అలాగే సముద్ర తీరంలో ఎడతెరిపి లేని వర్షంతోపాటు ఈదురు గాలులు వీస్తున్నాయి. స్థానికులు చలికి వణికిపోతున్నారు. గత రెండు రోజులు గా సముద్రంపై చేపల వేటలో ఉన్న మత్స్యకారులు ఒడ్డుకు చేరుకుంటున్నారు. బోట్లు, వేట సామగ్రిని ఒడ్డున భద్రపరిచారు. మత్స్యకార పెద్దలు కొందరు సముద్రం వద్దే నిఘా పెట్టారు. తీరప్రాంత గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.