మూడు కాదు.. ఆరు ముళ్లు | Young Man Marries TWO Girls at Once in Komaram Bheem | Sakshi
Sakshi News home page

వీడియో: ఆసిఫాబాద్‌లో ఇద్దరితో ఒకేసారి ప్రేమాయణం.. పెళ్లి కూడా!

Mar 29 2025 7:02 AM | Updated on Mar 29 2025 12:58 PM

Young Man Marries TWO Girls at Once in Komaram Bheem

కొమురం భీమ్: పెళ్లి చేసుకునేందుకు కొందరు యువకులకు అమ్మాయిలే దొరకని రోజులివి. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్న వారూ ఉన్నారు. కానీ కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఒక గిరిజన యువకుడు ఇద్దరు యువతులతో ప్రే మాయణం నడిపించడమే కా దు.. వారిద్దరినీ పెళ్లి చేసుకుని ఏడడుగులూ నడిచాడు. ఆరు ముళ్లు వేశాడు. ఈ పెళ్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం గుమ్నూర్‌ (కే)కు చెందిన సిడాం రూపబాయి, శ్రీమారుతి దంపతుల కుమారుడు సూర్యదేవ్‌.. హైదరాబాద్‌లో సినిమారంగంలో పని చేస్తున్నాడు.

సిర్పూర్‌(యూ) మండలం షెట్టిహడ్పనూరు రాజులగూడకు చెందిన కనక లాల్‌దేవితో మూడేళ్లుగా ప్రేమాయణం నడిపాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెను దూరం పెట్టి.. ఇదే మండలం పుల్లార గ్రామానికి చెందిన ఆత్రం జలకర్‌ దేవితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇంతలో ముందు ప్రేమించిన అమ్మాయి కనక లాల్‌దేవి.. తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించింది. 

దీంతో సూర్యదేవ్‌ జలకర్‌ దేవిని తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లిపోగా.. వారిని బంధువులు వెతికి పట్టుకొచ్చి మళ్లీ పంచాయితీ నిర్వహించారు. పెద్దల ముందు తాను ఇద్దరినీ చేసుకునేందుకు సూర్యదేవ్‌ అంగీకారం తెలిపాడు. తల్లిదండ్రులు, గ్రామస్తులు యువతుల అభి ప్రాయాన్ని కోరగా.. వారూ సరే అన్నారు. పెళ్లికార్డులు కొట్టించారు.. ఫ్లెక్సీలూ వేయించారు. ఈ నెల 27న గురువారం గుమ్నూ ర్‌లో ఇద్దరు అమ్మాయిలతో ఒకే వేదికపై ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం సూర్యదేవ్‌ పెళ్లి జరిపించారు. ఇద్దరినీ బాగా చూసుకుంటానని గ్రామ పటేల్, మాజీ సర్పంచ్‌ ఆత్రం తెలంగ్‌రావు సమక్షంలో పెళ్లి కొడుకు ఒక బాండ్‌ పేపర్‌ రాసి పెళ్లికూతుళ్లకు ఇచ్చాడు. మూడు గ్రామాల నుంచి వెయ్యి మంది హాజరై పెళ్లిని తిలకించారు. 

Advertisement
 
Advertisement
Advertisement