హైదరాబాద్‌లో దారుణం.. ట్రావెల్‌ బ్యాగ్‌లో మహిళ మృతదేహం | Woman Body Found In Travel Bag In Bachupally | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో దారుణం.. ట్రావెల్‌ బ్యాగ్‌లో మహిళ మృతదేహం

Jun 4 2025 2:56 PM | Updated on Jun 4 2025 5:39 PM

Woman Body Found In Travel Bag In Bachupally

సాక్షి, మేడ్చల్: బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో  గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు.

మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్‌తో ఉన్న మృతురాలికి 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాలనగర్ జోన్ డీఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. మృతురాలి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement