TG: షాకింగ్‌ ఘటన.. పసుపు లోడు లారీ హైజాక్ | Turmeric Lorry Hijacked In Nizamabad District | Sakshi
Sakshi News home page

TG: షాకింగ్‌ ఘటన.. పసుపు లోడు లారీ హైజాక్

Jul 19 2024 9:45 AM | Updated on Jul 19 2024 10:17 AM

Turmeric Lorry Hijacked In Nizamabad District

జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి పసుపు లోడు లారీని హైజాక్ చేశారు.

సాక్షి, నిజామాబాద్: జిల్లాలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి పసుపు లోడు లారీని హైజాక్ చేశారు. ఆర్టీఏ అధికారులమంటూ లారీని ఆపిన కేటుగాళ్లు.. డ్రైవర్‌పై మత్తు మందు చల్లి జన్నేపల్లి వైపు పసుపు లారీని తీసుకెళ్లారు.

అక్కడ నుంచి పసుపు లోడును వేరే వాహనాల్లోకి తరలించే యత్నం చేశారు. పోలీసుల ఎంట్రీతో దుండగులు పారిపోయారు. పసుపు విలువ సుమారు రూ. 50 లక్షల రూపాయలు ఉంటుందని  అంచనా.  నిజామాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement