Sakshi News home page

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం

Published Mon, Jul 24 2023 3:16 PM

TSPSC Paper Leak Case: Khammam Couple surrender To SIT Officials - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్‌ లీకేజీలో ప్రమేయం ఉన్న వారంతా కేసు నుంచి తప్పించుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు సిమ్ కార్డులు మార్చి పుణ్యక్షేత్రాలకు తిరిగినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ కేసులో తప్పించుకోలేమని తెలుసుకొని ఎట్టకేలకు సిట్‌ ఎదుట లొంగిపోయారు. అంతేగాక కేసు నుంచి తప్పించుకునేందుకు మరో 15 మంది ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.

కాగా ఇప్పటివరకు ఈకేసులో  90 మందిని పైగా అరెస్టు చేసిన సిట్ అధికారులు.. ఈ నెలాఖరులో మరో 10 మందిని అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందగాగానే రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి  సిట్‌ సిద్ధమైంది. ఇక పేపర్ లీకేజ్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్‌ తేల్చింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మి కంప్యూటర్‌ నుంచి ప్రవీణ్‌ పేపర్‌ను తీసుకొని ఆమె డైరీలో ఉన్న సాస్‌వర్డ్‌, యూజర్‌నేమ్‌ ద్వారా పేపర్‌ లీక్‌ జరిగినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

Advertisement

What’s your opinion

Advertisement