
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. 12 మంది సభ్యుల జాబితాకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం టీఆర్‌ఎస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. నేడు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పలు జిల్లాల్లో పలువురికి తిరిగి అవకాశం ఇవ్వగా, మరికొందరికి మొండిచేయి చూపించారు. సిట్టింగ్‌లలో ఐదుగురికి మాత్రమే మరో అవకాశం కల్పించారు. కొత్తగా ఏడుగురికి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు.
నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత అభ్యర్థిత్వంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె వద్దంటే ఆకుల లలితకు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్సీ పురాణం సతీష్ స్థానంలో దండే విఠల్, కరీంనగర్ నుంచి ఎల్.రమణ, భానుప్రసాద్‌రావు, ఖమ్మం నుంచి తాతా మధు, మహబూబ్‌నగర్ నుంచి సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి.. రంగారెడ్డి నుంచి శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి.. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి.. నల్గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి.. మెదక్ నుంచి డాక్టర్ యాదవరెడ్డిని ఖరారు చేశారు.