local body quota mlc
-
Local Bodies MLC: ఎమ్మెల్సీ అభ్యర్థి కవితే.. ఆమెకు మరోసారి నిరాశ
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో చివరివరకు కొనసాగి న ఉత్కంఠ వీడింది. సీఎం కేసీఆర్ తన య కల్వకుంట్ల కవిత మరోసారి బరి లోకి దిగుతున్నారు. ఆకుల లలితకు టిక్కెట్టు ఖాయమనుకున్నప్పటికీ చివరకు సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకే ఖరారైంది. టీఆర్ఎస్కు సింహభాగం ఓ ట్ల బలముండడంతో కవిత గెలుపు నల్లేరు మీద నడకే. అయితే ఈ స్థా నాన్ని ఆకుల లలితకు కేటాయిస్తారని తుదివరకు వార్తలు వచ్చాయి. లలిత పేరే చివరి వ రకు పరిశీలనలో ఉంది. కవిత రాజ్యసభకు వెళ్తారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. చివ రకు కవితే ఖరారు కావడం గమనార్హం. రాష్ట్రంలో అన్ని జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఆదివారమే ఒక స్పష్టత వచ్చినప్పటికీ నిజామాబాద్ విషయంలో మాత్రం మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠభరిత వాతావరణమే చోటుచేసుకుంటూ వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు కవిత నిజామాబాద్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కవిత ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత ఖరారుపై ఆమె అనుచర వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సురేష్‌రెడ్డి, బీబీ పాటిల్ హర్షం.. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పేరును ప్రకటించడంపై రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కౌన్సిల్ సభ్యురాలిగా కవిత అద్భుతంగా పని చేశారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం విషయంలో ఆమెకు ఉన్న నిబద్ధత ఎనలేనిదని, మహానేత సీఎం కేసీఆర్ తీసుకున్న అద్భుతమైన నిర్ణయానికి పార్లమెంట్ సభ్యులుగా తాము స్వాగతిస్తున్నామని, కవితకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటాలోనూ దక్కని అవకాశం.. జిల్లా నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఉన్న ఆకుల లలితకు వారం రోజుల తేడాతో వరుస గా రెండోసారి నిరాశ మిగిలింది. మరోసారి ఎమ్మెల్యే కోటాలో తనకు అవకాశం కల్పిస్తారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కచ్చితమైన హామీ ఉందని లలిత ధీమాతో ఉంటూ వచ్చా రు. ఎమ్మెల్యే అభ్యర్థి విషయానికి వస్తే వివిధ సమీకరణల నేపథ్యంలో చివరి నిముషంలో ఆకుల లలితకు స్థానం దక్కకుండా పోయింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానంలో మరో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చా రు. దీంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ కానుంది. ఈ రాజ్యసభ స్థానంలో కల్వకుంట్ల కవితను భర్తీ చేసి లలితకు నిజామాబాద్ స్థాని క సంస్థల కోటా నుంచి అవకాశం కల్పిస్తారనే వార్తలు వచ్చాయి. మరోవైపు శాసన మండలి లో మున్నూరుకాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేనందున లలితకు అవకాశం తప్పనిసరిగా కల్పిస్తారని రాజకీయ వర్గాలు భావించాయి. అయితే కవిత రాజ్యసభ బదులు మళ్లీ తన సిట్టింగ్ స్థానానికే మొగ్గు చూపడంతో ఆకు లలలితకు నిరాశే మిగిలింది. లలితకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. 2018లో కాంగ్రెస్ నుంచి తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లోకి తీసుకురావడంలో లలిత కీలక పాత్ర పోషించారు. లలిత వియ్యంకుడు నల్గొండ జిల్లాకు చెందిన నేతి విద్యాసాగర్ సైతం ఎమ్మెల్సీగా ఉండగానే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఆమెతోపాటే వచ్చారు. ఆ సమయంలో కేసీఆర్ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే విషయమై హామీ ఇచ్చారని, ల లిత ఇప్పటివరకు ధీమాగా ఉంటూ వచ్చారు. కాగా వివిధ సమీకరణల నేపథ్యంలో అంచనాలు తారుమారయ్యాయి. వారం రోజుల తేడాతో లలితకు ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అవకాశాలు త్రుటిలో చేజారడం గమనార్హం. రాజకీయమంటే ఇలాగే ఉంటుందని వివిధ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
ఆ జాబితాకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్..
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. 12 మంది సభ్యుల జాబితాకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం టీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. నేడు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పలు జిల్లాల్లో పలువురికి తిరిగి అవకాశం ఇవ్వగా, మరికొందరికి మొండిచేయి చూపించారు. సిట్టింగ్‌లలో ఐదుగురికి మాత్రమే మరో అవకాశం కల్పించారు. కొత్తగా ఏడుగురికి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు. నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత అభ్యర్థిత్వంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె వద్దంటే ఆకుల లలితకు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్సీ పురాణం సతీష్ స్థానంలో దండే విఠల్, కరీంనగర్ నుంచి ఎల్.రమణ, భానుప్రసాద్‌రావు, ఖమ్మం నుంచి తాతా మధు, మహబూబ్‌నగర్ నుంచి సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి.. రంగారెడ్డి నుంచి శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి.. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి.. నల్గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి.. మెదక్ నుంచి డాక్టర్ యాదవరెడ్డిని ఖరారు చేశారు. చదవండి: (తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు..) -
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల కోటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం బీఫాంలు అందజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో పార్టీ అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, తూమాటి మాధవరావు, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరికి సీఎం జగన్ బీఫాంలు అందజేశారు. ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే ఈ నెల 29న అసెంబ్లీ భవనంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు. లేనిపక్షంలో అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. చదవండి: (ఏపీ శాసనమండలి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల) -
రెండు జిల్లాల్లోనే పోటీ.. మిగిలినవి ఏకగ్రీవం
-
రెండు జిల్లాల్లోనే పోటీ.. మిగిలినవి ఏకగ్రీవం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పలువురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో మిగలడంతో అక్కడ ఎమ్మెల్సీ పదవులకు ఎన్నిక తప్పడంలేదు. కర్నూలు బరిలో టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డి. వెంకటేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా బరిలో టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి అట్ల చినవెంకటరెడ్డి పోటీ పడుతున్నారు. గుంటూరు జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణాజిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులు బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి రెడ్డి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడు, విశాఖ జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థులు ఎంవీవీఎస్ మూర్తి, పప్పల చలపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్కడ టీడీపీ అధిష్ఠానం బుజ్జగించడంతో మరో సీనియర్ నాయకుడు కన్నబాబు రాజు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే మంత్రి అయ్యన్నపాత్రుడు బుజ్జగింపుతో గవిరెడ్డి రామానాయుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. అందుకే అక్కడ ఏకగ్రీవం సాధ్యమైంది. ఇక విజయనగరం జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి ద్వారపురెడ్డి జగదీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.